అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. చంద్రబాబు నాయుడు అసలు ప్రతిపక్ష నేతేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన తీరు ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ స్థానానికి చంద్రబాబు కనీస గౌరవం ఇవ్వడం లేదని మండిపడ్డారు. తనకు ప్రతిపక్ష నేతగా చంద్రబాబుపై గౌరవం ఉందని కానీ చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు.  

మూడోరోజు అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టే అంశంపై చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో చంద్రబాబు స్పీకర్ పై అగ్రహం వ్యక్తం చేశారు. మర్యాదగా ఉండందంటూ హెచ్చరించారు. 

చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు స్పీకర్ తమ్మినేని సీతారాం. మర్యాదగా ఉండదని తమను స్పీకర్ ను అంటారా అంటూ నిలదీశారు. ఇన్నేళ్లు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. 

సభ్యత, మర్యాదగా లేకుండా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు అసహనానికి గురవుతున్నారంటూ విరుచుకుపడ్డారు. అసహనంతో ఇలానే వ్యవహరిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. 

జగన్ సూపర్ ప్లాన్, వంశీకి స్పెషల్ బెర్త్: క్యూ లైన్లో ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలు...

చంద్రబాబు నాయుడు స్పీకర్ స్థానాన్ని అగౌరవపరుస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని సూచించారు. స్పీకర్ ను మర్యాదగా ఉండదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. 

చంద్రబాబు లాంటి వ్యక్తులను చాలా మందిని చూశామని చెప్పుకొచ్చారు. స్పీకర్ ను కూడా గౌరవించుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నారంటూ విరుచుకుపడ్డారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ప్రతిపక్ష నేతగా ఇలా వ్యవహరించడం చాలా బాధాకరమన్నారు స్పీకర్ తమ్మినేని సీతారాం. 

మా అమ్మ మీలా వీధి రౌడీలా పెంచలేదు: జగన్ పై నారా లోకేష్...