అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కొద్దిసేపటికి అసెంబ్లీని 10 నిమిషాల పాటు వాయిదా వే్స్తున్నట్టుగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.

Also read: టీడీపీకి షాక్: ఆఫీస్‌కు భూకేటాయింపు రద్దు

సోమవారం నాడు ఉదయం 11 గంటలకు  ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24వ తేదీన చోటు చేసుకొన్న పరిణామాలను స్పీకర్ ప్రస్తావించారు. అయితే శాసన మండలి గురించి అంశాలపై చర్చించేందుకు వీలుగా ఏ పార్టీ ఎంత సేపు మాట్లాడాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పీకర్ అభిప్రాయపడ్డారు.

Also read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం

ఈ విషయమై చర్చించేందుకు గాను బీఎసీ సమావేశపర్చాల్సిన అవసరం ఉందని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. బీఎసీ సమావేశ నిర్వహణ కోసం శాసనసభను వాయిదా వేస్తున్నట్టుగా స్పీకర్  తమ్మినేని సీతారాం ప్రకటించారు. బీఏసీ సమావేశంలో ఏ పార్టీ ఎంత సేపు మాట్లాడాలనే విషయమై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాకముందే రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ శాసనసభపక్షం ఓ లేఖ రాసింది. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోకుండానే ఈ నెల 27వ తేదీన అసెంబ్లీని సమావేశపర్చారని టీడీపీ శాసనసభపక్షం  ఈ లేఖలో గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. 

ఏపీ అసెంబ్లీ, శాసనమండలిని మూడు రోజుల పాటు నిర్వహించాలని గత బీఏసీ సమావేశంలో తీసుకొన్న నిర్ణయాన్ని టీడీపీ శాసనసభపక్షం ఈ సందర్భంగా గుర్తు చేసింది. బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోకుండానే ఈ నెల 27వ తేదీన అసెంబ్లీని ఎలా సమావేశపరుస్తారని టీడీపీ ప్రశ్నించింది.ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లింది.అయితే  ఈ బీఎసీ సమావేశంలో సీఎం జగన్, మంత్రులు కన్నబాబు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విప్ శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.