ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలి రద్దు చేస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ కేబినెట్ సోమవారం నాడు ఆమోదించింది.

Also read:ఏపీ శాసనమండలి రద్దైతే ఆ ఇద్దరు మంత్రులకు ఎసరు

ఏపీ అసెంబ్లీ ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం చేయనుంది.ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నారు. పార్లమెంట్ ఉభయ సభలు దీన్ని ఆమోదిస్తే  శాసనమండలి రద్దు కానుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో శాసనమండలిని రద్దు చేశారు. ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2007లో  శాసనమండలిని పునరుద్దరించారు. 

ఏపీ శాసనమండలి రద్దు తీర్మాణం అసెంబ్లీలో ఆమోదం పొందాలంటే 2/3 వంతు సభ్యుల ఆమోదం పొందాలి. శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం ఆమోదం పొందాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారంగా శాసనమండలి రద్దు లేదా శాసనమండలిని పునరుద్దరించే  అవకాశం ఉంటుంది. 

శాసనమండలి రద్దును కేంద్రం ఒప్పుకొంటే  త్వరగా జరిగే అవకాశం ఉంటుంది.  అయితే కేంద్రం శాసనమండలి రద్దు విషయంలో  సానుకూలంగా ఉంటే  ఈ ప్రక్రియ త్వరగా  పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో 2004 ఎన్నికలకు ముందు అప్పటి సీఎల్పీ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సమయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల సమస్యలపై పలు హామీలను ఇచ్చారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలకు పదవులను ఇచ్చేందుకు వీలుగా శాసన మండలిని పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు.

2004లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని  సాధించింది. అదే సమయంలో కేంద్రంలో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ (యూపీఏ) అధికారంలో ఉంది. 

దీంతో రాజశేఖర్ రెడ్డి శాసనమండలి పునరుద్దరణ ప్రక్రియను ప్రారంభించారు.కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల సహకారంతో పార్లమెంట్ ఉభయ సభల్లో ఈ బిల్లు ఆమోదం పొందింది. 2007 ఏప్రిల్ రెండో తేదీన ఏపీ శాసనమండలి పునరుద్దరణ జరిగింది.
 

ఏపీ అసెంబ్లీలో ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంపై  సోమవారం నాడు తీర్మానం చేయనున్నారు. అయితే అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ నిర్ణయం తీసుకొంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత కేంద్రానికి ఈ తీర్మానాన్ని ప్రభుత్వం పంపనుంది.