టీడీపీకి షాక్: ఆఫీస్‌కు భూకేటాయింపు రద్దు
ఏపీ ప్రభుత్వం కడపలో టీడీపీకి కేటాయించిన రెండు ఎకరాల భూమిని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.
అమరావతి: కడప లో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండెకరాల స్థలాన్ని రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ సోమవారం నాడు నిర్ణయం తీసుకొంది. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో టీడీపీ కార్యాలయానికి రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
Also read:ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం
సోమవారం నాడు ఏపీ కేబినెట్ సమావేశం సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన అమరావతిలో జరిగింది.ఈ సమావేశంలో ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ తీర్మానం తర్వాత కడపలో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని రద్దు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.మరోవైపు చినజీయర్ మఠానికి ఇంద్రకీలాద్రిపై 40 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొంది.
కేబినెట్ సమావేశం ప్రారంభంకాగానే ఏపీ శాసన మండలి రద్దు తీర్మానాన్ని న్యాయశాఖ కార్యదర్శి మనోహర్ రెడ్డి చదివి వినిపించారు. కేబినెట్ సమావేశం ఏపీ శాసనమండలి రద్దు తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో ఏపీ శాసనమండలి రద్దు విషయమై తీర్మానానికి ఆమోదం తెలిపేందుకు ఏర్పాటు చేశారు. ఏపీ శాసనమండలి రద్దు తీర్మానంతో పాటు కడపలో టీడీపీ కి కేటాయించిన రెండు ఎకరాల స్థలంతో పాటు జీయర్ స్వామి మఠానికి భూమిని కేటాయిస్తూ ఆమోదం తెలిపిన తర్వాత మంత్రివర్గసమావేశం ముగిసింది.