అమరావతి: మత్స్యశాఖకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించింది. మత్య్సకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధికంగా నిధులను కేటాయించినట్టుగా ప్రభుత్వం స్పష్టం చేసింది

శుక్రవారం నాడు  అసెంబ్లీలో మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.  ఈ వ్యవసాయ బడ్జెట్‌లో మత్స్యశాఖ అభివృద్దికి రూ. 550 కోట్లను కేటాయించారు.

ఈ ఏడాది 12 ఈనాం మార్కెట్లను  ఏర్పాటు చేయనున్నారు. చేపల వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతిని రూ. 10వేలకు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

చేపల వేటకు వెళ్లి మత్య్సకారులు మరణిస్తే ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లించాలని నిర్ణయం తీసుకొన్నారు. జువ్వలదిన్నె, ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలలో ఫిషింగ్ హార్బర్ల ఏర్పాటుకోసం రూ. 1758 కోట్లను బడ్జెట్‌లో  కేటాయించారు. 

 

సంబంధిత వార్తలు

ప్రకృతి విపత్తులకు బడ్జెట్‌లో రూ.2002 కోట్లు: ఏపీ ప్రభుత్వం

ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు: బుగ్గన

బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన