అమరావతి: రాష్ట్రంలో  అర్హులైన 25 లక్షల మందికి వచ్చే ఐదేళ్లలో ఇళ్లను నిర్మించాలని ఏపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. 

శుక్రవారం నాడు ఏపీ  రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.  గృహ నిర్మాణానికి పెద్ద  పీట వేస్తామని  ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

రానున్న ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఇళ్లు లేని నిరుపేదలకు 25 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ  చేస్తామన్నారు. 2020 మార్చి 25 నాటికి 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నట్టు మంత్రి ప్రకటించారు.

మహిళల పేరు మీదే  ఇళ్ల స్థలాల పట్టాలను ఇస్తామన్నారు.  ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కోసం ప్రభుత్వ భూములతో పాటు అవసరమైతే ప్రైవేట్ భూములను కూడ సేకరిస్తున్నట్టుగా  ప్రభుత్వం ప్రకటించింది.

గత ఐదేళ్లలో  పట్టణ ప్రాంతాల్లో 91,119 ఇళ్లను నిర్మించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 7,04,916 ఇళ్లను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


సంబంధిత వార్తలు

బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన