అమరావతి:  ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు గాను ఏపీ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 2002 కోట్లను కేటాయించింది.

శుక్రవారం నాడు అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను  ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. ప్రకృతి విపత్తుల కారణంగా చేతికొచ్చిన పంటలు దెబ్బతిని రైతులు  తీవ్రంగా నష్టపోతున్నారని ప్రభుత్వం గుర్తు చేసింది.

ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన  రైతులను ఆదుకొనేందుకు  రాష్ట్ర ప్రభుత్వం  ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి కింద బడ్జెట్‌లో రూ.2002 కోట్లను ప్రతిపాదించారు.

ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకొనేందుకు ఈ నిధి నుండి డబ్బులను రైతులకు అందించనున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సాధారణంగా అయితే ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులకు వచ్చే ఏడాది సహాయం అందుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

ప్రకృతి విపత్తుల సహాయ నిధిని ఇతర అవసరాల కోసం ఖర్చు చేయబోమని  రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

సంబంధిత వార్తలు

ఐదేళ్లలో 25 లక్షల మందికి ఇళ్లు: బుగ్గన

బుగ్గన బడ్జెట్: మధ్యతరగతికి ఊరట

బుగ్గన బడ్జెట్‌: రైతాంగానికి పెద్దపీట

ప్రత్యేక హోదా కోసం ప్రయత్నిస్తాం: బుగ్గన