వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్యతో కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నం ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనను మరచిపోక ముందే నగరంలోని మాచవరం ప్రాంతంలో మరో హత్యాయత్నం జరిగింది.

Also Read:పక్కా ఆధారాలతోనే కొల్లు రవీంద్ర అరెస్ట్: భాస్కరరావు హత్య కేసుపై ఎస్పీ వివరణ

కారు ఫైనాన్స్ డబ్బులు అడిగేందుకు వెళ్లిన వరుణ్ మారుతి సంస్థ ఉద్యోగిపై తండ్రీ, కొడుకులు కత్తితో దాడి చేశారు. చిలకలపూడికి చెందిన జ్యూవెలరీ షాపు యజమాని నాగేశ్వరరావు అతని కుమారుడు కలిసి హత్యాయత్నానికి పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు.

పక్కా పథకం ప్రకారం మాచవరంలోని రోడ్లపై ఉన్న దుకాణాల వద్ద వున్న కత్తితో వరుణ్ మారుతి ఉద్యోగి  రాజేశ్‌పై దాడి చేసి పక్కనే వున్న డ్రైనేజీలో పడేసి పారిపోయారు. హత్యకు గురైన వ్యక్తిని పెడన దక్షిణ తెలుగు పాలెం 19వ వార్డుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

Aslo Read:చెరువు భూముల అమ్మకం వల్లే హత్య.. రవీంద్రను వదలొద్దు: భాస్కరరావు భార్య

సమాచారం అందుకున్న పోలీసులు రాజేశ్‌ను మచిలీపట్నం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆంధ్రా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... తండ్రీ, కొడుకుల కోసం గాలిస్తున్నారు. మరోవైపు నగరంలో వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.