Asianet News TeluguAsianet News Telugu

తిరుమలలో బోనులో చిక్కిన మరో చిరుత.. 50 రోజుల వ్యవధిలో మూడోది..

తిరుమలలో సంచరిస్తున్న మరో చిరుత బోనులో పడింది. ఫారెస్టు అధికారులు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఉంచిన ఓ బోనులో గురువారం తెల్లవారుజామున చిరుత చిక్కింది.

Another leopard trapped in a cage in Tirumala.. third in 50 days..ISR
Author
First Published Aug 17, 2023, 9:33 AM IST

తిరుమలలోని అలిపిరి మార్గంలో ఓ చిరుత బోనులలో పడిన మూడు రోజుల తరువాత.. మరొకటి కూడా అలాగే చిక్కింది. గురువారం తెల్లవారుజామున లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఫారెస్టు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఓ చిరుత చిక్కుకుంది. మూడు రోజుల కిందట అలిపిరి మెట్ల మార్గంలోని ఏడో మైలు వద్ద ఉన్న బోనులో చిరుత చిక్కింది. అది చిన్నారి లక్షితపై దాడి చేసిన మృగమనే అని అధికారులు భావిస్తున్నారు.

భర్తకు మరో యువతితో దగ్గరుండి పెళ్లి చేయించి.. మళ్లీ అతడి కోసం గొడవ.. హైదరాబాద్ లో వింత ఘటన

అయితే తాజాగా మరో చిరుత భక్తులకు కనిపించడం కలకలం రేకెత్తించింది. దీంతో అధికారులు ఇటీవల ఏర్పాటు చేసిన బోనులను అలాగే ఉంచారు. దీంతో మోకాలిమెట్టు, లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని 35వ మలుపు దగ్గర ఉంచిన ఓ బోనులో చిరుత చిక్కుకుంది. కాగా.. గడిచిన 50 రోజుల్లో ఇలా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్న మూడో చిరుత ఇది. 

నాగావళి నదిలో మునిగి సోదరుల దుర్మరణం.. తోడళ్లుడి కొడుకును కాపాడి.. కన్న బిడ్డలను రక్షించుకోలేకపోయిన తండ్రి

ఈ నెల 11వ తేదీన లక్షిత అనే ఆరేళ్ల బాలికపై బాలికపై చిరుత దాడి ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేకెత్తించిన విషయం తెలిసిందే. లక్షిత తన తల్లిదండ్రులతో కలిసి 11వ తేదీన శుక్రవారం తిరుమలకు వచ్చింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆ కుటుంబం కాలినడకన శ్రీవారిని దర్శించుకోవాలని భావించింది. ఈ క్రమంలో అలిపిరి నడక మార్గంలో వారంతా నడుస్తున్నారు.

తాజా సర్వే: ఏపీలో జగన్ హవా, చంద్రబాబు గాలి నామమాత్రమే

వీరంతా నడుస్తున్న క్రమంలో లక్షిత వారి కంటే వేగంగా ముందుకు వెళ్లింది. తరవాత కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయింది. తమ పాట కనిపించడం లేదని గుర్తించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యారు. గాలింపు చర్యలు చేపడితే లక్షిత తీవ్ర గాయాలతో మరణించి కనిపించింది. దీంతో బాలికపై చిరుత దాడి చేసి చంపేసిందని అధికారులు నిర్దారణకు వచ్చారు. దీంతో దానిని పట్టుకోవడానిఖి ఫారెస్టు అధికారులు బోనులు ఏర్పాటు చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios