అమరావతి: ప్రజలకు సులభతరమైన రెవెన్యూ సేవలు, సమగ్ర సర్వే, పక్కాగా భూ రికార్డులు పరిశీలన జరిగేలా సూచనలు చేయడమే ప్రధాన లక్ష్యంగా కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని వైసిపి సర్కార్ నిర్ణయించింది. ముఖ్యంగా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూనే లిటిగేషన్లు తగ్గించేలా అందరికీ ఆమోయోగ్యమైన సూచనలు చేసేందుకు ఈ కమీటి ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. 

గురువారం సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్, మంత్రులు కురసాల కన్నబాబు, అనిల్ కుమార్ యాదవ్, సిసిఎల్ఎ నిరబ్ కుమార్ ప్రసాద్, రెవెన్యూ సెక్రటరీ ఉషా రాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

read more  శ్రీవారి సేవలో యడియూరప్పతో కలిసి జగన్: పర్యటనలో మార్పు

రాష్ట్రంలో ప్రస్తుత రెవెన్యూ సంబధిత సమస్యలపై వీరు సుదీర్ఘంగా చర్చించారు. 22A క్రింద ఉన్న భూములపై సరైన రీతిలో అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఎస్టేట్, ఇనాం భూములపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వ్యవసాయ భూములను అతి తక్కువగా నామినల్ రుసుము చెల్లించి కన్వర్ట్ చేసి కోట్ల రూపాయిలు ఆర్జిస్తున్నారని... దీనిపై సరైన నిర్ణయం తీసుకోనేలా చర్యలు తీసుకోవడంపైనా ఈ సమావేశంలో చర్చ జరిగింది. 

వీడియో

"

ఫ్రీడం ఫైటర్స్, మాజీ సైనికులకు ఇచ్చిన భూముల విషయంలో ఉన్న సమస్యలు, ఫిర్యాదుల పట్ల సమగ్ర విచారణ జరిపి వారికి తగిన న్యాయం చేయాలని నిర్ణయించారు. క్షేత్ర స్థాయి సమస్యలు తెలుసుకునేందుకు ఒక నెల రోజులు స్పందన ఫిర్యాదులను అధ్యయనం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.