ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే తెలుగును లేకుండా చేయాలన్నది ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పరిశోధనలో వెల్లడయింది
రాష్ట్రంలోని మునిసిపల్ పాఠశాలలో తెలుగుమీడియంను పూర్తిగా రద్దు చేశారు.
ఇంగ్లీస్ మీడియం మాత్రమే బోధిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లుండి ఈ నిర్ణయం తీసుకోవడం అందిరిని ఆశ్యర్యపరస్తూ ఉంది. అందునా విద్యాసంవత్సరం మధ్యలో ఇలా తెలుగు మీడియంను ఇంగ్లీష్ మీడియంకు మార్చేడం వల్ల చాలా మంది విద్యార్ధులు ఇబ్బంది పడతారని ఉపాధ్యాయ సంఘాలు గోల చేస్తున్నా, అన్ని మునిసిపల్ స్కూళ్లలో తెలుగు మీడియం రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం జివొ ఇచ్చింది.
విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా, టీచర్లున్నారా లేదా అనే అంశం జోలికి వెళ్లకుండా అన్ని క్లాసులలో తెలుగుమీడియంను ఇంగ్లీష్ మీడియంగా మార్చేయాలని ప్రభుత్వం ఆదేశించింది (MUNICIPAL ADMINISTRATION & URBAN DEVELOPMET (D1) DEPARTMENT G.O.MS.No. 14).
ఒక్క పదో తరగతికి మాత్రం ఇది వర్తించదు. 2016- 17 విద్యాసంవత్సరంలో పదో తరగతిలో మాత్రం తెలుగు మీడియం వుంటుంది.
బోధనా మాధ్యమం అనేది విద్యార్థి భవిష్యత్తునునిర్ణయిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫౌండేషన్ కోర్సుకు ఎనలేని జనాదరణ లభించినందున ఇంగ్లీష్ మీడియంను తప్పని సరి చేస్తున్నట్లు పేర్కొన్నారు.
“The overwhelming support for the said programme from all the concerned including general public, and the enthusiasm shown by the students, parents and teachers had really made the Government to decide to make the foundation course mandatory for all the students studying in all Municipal Schools. Hence, the medium of instruction plays a very crucial role in defining the destiny of the student.” జివో పేర్కొంది.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి సరైన విద్యా, భాషా విధానం లేదని స్పష్టమ వుతుంది. కేంద్ర ప్రభుత్వం ఇంజనీరింగ్, మెడికల్ పరీక్షలకు నీట్ నిర్వహించాలన్నపుడు తెలుగు మీడియం సాకు చూపి వద్దని వాదించారు.
ఇపుడేమో పోటీపరీక్షలకు తయారుచేసే ఉద్దేశంతో తెలుగుమీడియంనే ఎత్తేస్తున్నారు. పోటీపరీక్షలకు విద్యార్థుల విజ్ఞానం పెంచాలి గాని, తెలుగు మీడియం చదివితే ఇంగ్లీష్ రాదునుకోవడం, తెలుగు మీడియం పనికేరాదనుకోవడం తీవ్రవాదం. అసలు తెలుగు మీడియంనే ఎత్తేయడం ఎంత వరకు సబబు. ఇంగ్లీష్ లో మంచి శిక్షణ , ఇతర పాఠ్యాంశాలలో జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన చేయడం, పాఠశాలలను లైబ్రరీలను, లాబొరేటరీలను పటిష్టం చేయడం, సకాలంలో పుస్తకాలు అందించడం, మరుగుదొడ్లు మంచినీళ్లు అందుబాటులోకి తీసుకురావడం మధ్యాహ్నం భోజనపథం గౌరవ ప్రదంగా అమలుచేయడం వంటివాటి జోలికి వెళ్లకుండా రాత్రికి రాత్రి తెలుగు మీడియం మూసేస్తున్నారు.
తెలుగే ముద్దు ఇంగ్లీష్ వద్దంటున్న వారి వెర్రికి, ఇంగ్లీష్ రావాలంటే తెలుగుమానేయాలన్న ఏలిన వారిక వెర్రికి పెద్ద తేడా లేదు.
మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియం రద్దు చేస్తూ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఐ.వెంకటేశ్వరరావు, పి.బాబురెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
ప్రాథమిక విద్యలో ఇంగ్లిష్‌ను ఒక సబ్జెక్టుగానే బోధించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 2118 మున్సిపల్ పాఠశాలల్లో సుమారు 2,51,774 మంది విద్యార్థులు చదువుతున్నారని, విద్యా సంవత్సరం మధ్యలో అర్థాంతరంగా మీడియం మార్పు నిర్ణయంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారని తెలిపారు.
