కృష్ణాజిల్లా: ప్రాంణాంతక కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందకు మచిలీపట్నం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడ నుండి మచిలీపట్నంకు  కూరగాయలు రవాణాను తాత్కాలికంగా నిలుపుదల చేశారు అధికారులు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణను అడ్డుకునేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.  ఇందుకోసం కీలకమైన ఈ నిర్ణయం తీసుకుంది బందరు డివిజన్ టాస్క్ ఫోర్స్ కమిటీ. 

బందరు ఆర్డీఓ ఖాజావలీ అధ్యక్షతన సమావేశమైన టాస్క్ ఫోర్స్ అధికారులు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల విజయవాడ  నుండి కూరగాయలు తీసుకువచ్చిన ఓ డ్రైవర్ కు కరోనా పాజిటీవ్ రావటంతో అప్రమత్తమయ్యింది. దీంతో టాస్క్ ఫోర్స్ ఇకపై విజయవాడ నుండి కాకుండా ఏలూరు, అవనిగడ్డ నుండి కూరగాయలు తెప్పించేందుకు ఏర్పాటులు చేస్తున్నారు అధికారులు. 

ఈ మేరకు మచిలీపట్నం రైతుబజారు ఎస్టేట్ ఆఫీసర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. లాక్ డౌన్ వేళ దాతల ద్వారా నిరుపేదలకు ఫుడ్ ప్యాకెట్స్, నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీకి కూడా బ్రేక్ లు వేశారు. మే 1వ తేదీ నుండి పంపిణీ కార్యక్రమాలు పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించారు. మాంసాహార విక్రయాల్లో కూడా కొత్త ఆంక్షలు విధించారు. 

కేవలం చికెన్, మటన్ అమ్మకాలకే అనుమతులిచ్చి చేపలు, ఇతర మాంసాహారాల విక్రయాలను పూర్తిగా నిషేధించారు. ప్రభుత్వం నిర్ధేశించిన ధరలను కాదని  నిత్యావసర వస్తువులు అమ్మకాలు చేస్తే షాప్ మూసివేయటంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయనున్న అధికారులు హెచ్చరించారు. రెడ్ జోన్ లు నిత్యావసర దుకాణాలు కాకుండా ఏ దుకాణం తెరిచినా చర్యలు తీసుకుంటామన్న ఆర్డీఓ ఖాజావలీ స్పష్టం చేశారు.