ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల్లో 57 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2157కి  చేరుకొన్నాయి. ఈ వైరస్ సోకి ఇప్పటివరకు 48 మంది మృతి చెందారు. 

గత 24 గంటల్లో నమోదైన 57 కేసుల్లో చిత్తూరు, నెల్లూరులలో 14 చొప్పున కేసులు నమోదయ్యాయి. అనంతపురంలో 4, తూర్పుగోదావరిలో 1, కడపలో 2, కృష్ణాలో 9, కర్నూల్ 8, నెల్లూరులో 14,విశాఖపట్టణంలో 02, విజయనగరంలో 03 కేసులు నమోదయ్యాయి.

 

రాష్ట్రంలోని అనంతపురంలో 122, చిత్తూరులో 165, తూర్పుగోదావరిలో 52, తూర్పు గోదావరిలో 52, గుంటూరులో 404, కడపలో 101,కృష్ణాలో 360, కర్నూల్  లో 599, నెల్లూరులో 140,ప్రకాశంలో 63, శ్రీకాకుళంలో 7, విశాఖపట్టణంలో 68, విజయనగరంలో07, పశ్చిమగోదావరిలో 69 కేసులు నమోదయ్యాయి.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: తిరుమల వెంకన్న చెంతకు ఆర్టీసీ బస్సు ట్రయల్ రన్

రాష్ట్ర  వ్యాప్తంగా 857 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా  ఏపీ ప్రభుత్వం తెలిపింది. కరోనా సోకినవారిలో కోలుకొన్న వారు 1252 మందిగా ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈ వైరస్ సోకి ఇప్పటి వరకు 48 మంది మరణించినట్టుగా ప్రకటించింది సర్కార్.