ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. గత 24 గంటల్లో  191 మందికి కరోనా సోకినట్టుగా తేలింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,70,286కి చేరుకొన్నాయి.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో21,380 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 191 మందికి కరోనా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,70,286కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి ఇద్దరు మరణించారు.నిన్న ఒక్క రోజులో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో 14,418 మంది మరణించారు.

గడిచిన 24 గంటల్లో 416 మంది Corona నుంచి కోలుకొన్నారు. Andhra pradesh రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 53వేల 134మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 2734 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 3,00,31,083 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో010,చిత్తూరులో 037, తూర్పుగోదావరిలో013,గుంటూరులో018,కడపలో 002, కృష్ణాలో041, కర్నూల్ లో002, నెల్లూరులో013, ప్రకాశంలో 004,విశాఖపట్టణంలో 017,శ్రీకాకుళంలో011, విజయనగరంలో 004,పశ్చిమగోదావరిలో 019కేసులు నమోదయ్యాయి.

also read:ఆంధ్రప్రదేశ్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు: మొత్తం కేసులు 20,70,095కి చేరిక

గత 24 గంటల్లో కరోనాతో ఇద్దరు మరణించారు. కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున కరోనాతో చనిపోయినట్టుగా ప్రభుత్వం తెలిపింది..దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,418కి చేరుకొంది.


ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,948, మరణాలు 1093
చిత్తూరు-2,47,621, మరణాలు1951
తూర్పుగోదావరి-2,94,408, మరణాలు 1290
గుంటూరు -1,78,517,మరణాలు 1247
కడప -1,15,781,మరణాలు 644
కృష్ణా -1,19,832,మరణాలు 1445
కర్నూల్ - 1,24,172,మరణాలు 854
నెల్లూరు -1,46,660,మరణాలు 1053
ప్రకాశం -1,38,636, మరణాలు 1128
శ్రీకాకుళం-1,23,291, మరణాలు 788
విశాఖపట్టణం -1,58,137, మరణాలు 1133
విజయనగరం -83,011 మరణాలు 672
పశ్చిమగోదావరి-1,79,377, మరణాలు 1120

Scroll to load tweet…