జగన్ సర్కార్‌కి షాక్: 623 జీవో సస్పెండ్ చేసిన ఏపీ హైకోర్టు

పంచాయితీ కార్యాలయాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయడంపై  దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

Andhra pradesh High court suspends G.O. 623

అమరావతి: పంచాయితీ కార్యాలయాలతో పాటు, ప్రభుత్వ కార్యాలయాలకు నాలుగు రంగులు వేయడంపై  దాఖలైన పిటిషన్ ను ఏపీ హైకోర్టు మంగళవారం నాడు విచారించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలిచ్చింది.

ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామపంచాయితీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడంపై పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వైసీపీ రంగులను తొలగించాలని ఆదేశాలను జారీచేసింది హైకోర్టు.  దీంతో ఈ మూడు రంగులతో పాటు మరో రంగును కూడ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో నాలుగు రంగులు వేయాలని ఈ జివో స్పష్టం చేసింది.

also read:బయటినుండే వచ్చింది: కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డ లేఖపై ఫోరెన్సిక్ రిపోర్ట్

సుప్రీంకోర్టు ఉత్తర్వుకు విరుద్దంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిందని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు 623 జివోను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ విషయమై సరైన వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే కోర్టు ధిక్కరణ కిందకు వస్తోందని కూడ కోర్టు స్పష్టం చేసింది.ఈ పిటిషన్ పై విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios