విశాఖపట్టణం: ఎల్జీ పాలీమర్స్ లో స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో  విశాఖపట్టణంలోని పలు పరిశ్రమలో నిల్వ ఉన్న స్టైరిన్ గ్యాస్ నిల్వలను అధికారులు సేకరిస్తున్నారు.
ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్టణంలో ఈ నెల 7వ తేదీన స్టైరిన్ గ్యాస్ లీకైంది.దీంతో  12 మంది మృతి చెందారు. వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. 

అస్వస్థతకు గురైన వారు ప్రస్తుతం కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.  విశాఖపట్టణంలో పలు రసాయన పరిశ్రమలు ఉన్నాయి.  ఈ పరిశ్రమలు స్టైరిన్ గ్యాస్ ను వినియోగిస్తున్నాయి. 

also read:విశాఖలో స్టైరిన్ గ్యాస్ లీక్: గ్రీష్మ కుటుంబానికి రూ. కోటి పరిహారం చెల్లింపు

విశాఖలో స్టైరిన్ గ్యాస్ నిల్వలపై ప్రత్యేక అధికారుల బృందం సమాచారాన్ని సేకరించింది. విశాఖలోని పలు పరిశ్రమల్లో సుమారు 9 వేల టన్నుల స్టైరిన్ గ్యాస్ నిల్వలు ఉన్నట్టుగా అధికారుల బృందం గుర్తించింది. 

స్టైరిన్ గ్యాస్ నిల్వలను తిరిగి దిగుమతి చేసుకొన్న కంపెనీలకు తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

also read:పెరిగిన ధరల ఎఫెక్ట్: ఏపీలో భారీగా పడిపోయిన మద్యం అమ్మకాలు

సముద్ర మార్గంలో స్టైరిన్ గ్యాస్ నిల్వలను దిగుమతి చేసుకొన్న దేశాలకు తరలించనున్నారు.  స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో విశాఖలో  ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.