Asianet News TeluguAsianet News Telugu

స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

అక్టోబర్ 31న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. 

Andhra Pradesh : Election Commission releases MLC election schedule
Author
Hyderabad, First Published Nov 9, 2021, 2:19 PM IST

అమరావతి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటా MLC election schedule విడుదలయ్యింది. మంగళవారం 11 ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. అనంతపురం-1, కృష్ణా-2, తూర్పు గోదావరి -1, గుంటూరు-2, విజయనగరం-1, విశాఖపట్నం-2, ప్రకాశం-1 స్థానాలకు షెడ్యూల్ ప్రకటించారు. 

నవంబర్ 16న నోటిఫికేషన్, డిసెంబర్ 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. telangana స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, మెదక్, నిజామాబాద్, ఖమ్మం నుంచి ఒక స్థానం.. కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి నుంచి రెండు స్థానాలకు మంగళవారం షెడ్యూల్ ను ప్రకటించారు. 

నవంబర్ 16న నోటిఫికేషన్, నవంబర్ 23న నామినేషన్ల స్వీకరణకు చివరితేదీ, నవబంర్ 24న నామినేషన్ల పరిశీలన, నవంబర్ 26న ఉపసంహరణకు చివరి తేదీ, డిసెంబర్ 10న పోలింగ్, డిసెంబర్ 14న counting జరగనుంది. 

కాగా, అక్టోబర్ 31న తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను EC వాయిదా వేసింది. 

ఈ క్రమంలోనే ఈ రోజు నవంబర్ 9వ తేదీన ఎన్నికల notification ను విడుదల చేసింది ఈసీ. అయితే ఎమ్మెల్సీ పదవులు కేసీఆర్ ఎవరికి కట్టబెడుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గులాబీ బాస్ ను ప్రసన్నం చేసుకొనేందుకు టీఆర్ఎస్ నేతలు  ప్రయత్నాలు చేస్తున్నారు.
 
తెలంగాణ రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీన ముగిసింది.
 
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.చిన్న గోవింద్ రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే 31న ముగిసింది.

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో పోటీ తీవ్రం, రేసులో కీలక నేతలు

తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు Trsకే దక్కుతాయి. అయితే ఈ ఆరు స్థానాల కోసం ఆశావాహుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైన వారిలో ఎందరికీ తిరిగి రెన్యూవల్ చేస్తారనే చర్చ టీఆర్ఎస్‌లో సాగుతుంది.

శాసనమండలి ఛైర్మెన్ గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలకు మరోసారి ఎమ్మెల్సీ పదవులను రెన్యువల్ చేస్తారా లేదా అనే చర్చ నెలకొంది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సమయంలో కడియం శ్రీహరి ఇంట్లోనే సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు

అంతకుముందు కేటీఆర్ వరంగల్ జిల్లా టూర్ కు వెళ్లిన సమయంలో కూడా శ్రీహరి ఇంటికి వెళ్లారు. అయితే శ్రీహరికి ఎమ్మెల్సీని మరోసారి రెనివల్ చేస్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.. ఇదే జిల్లా నుండి బోడకుంట్ల వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైంది. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా అనేది తేలలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios