MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో పోటీ తీవ్రం, రేసులో కీలక నేతలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు: టీఆర్ఎస్‌లో పోటీ తీవ్రం, రేసులో కీలక నేతలు

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎన్నికం సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఎమ్మెల్సీ పదవులు కేసీఆర్ ఎవరికి కట్టబెడుతారనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గులాబీ బాస్ ను ప్రసన్నం చేసుకొనేందుకు టీఆర్ఎస్ నేతలు  ప్రయత్నాలు చేస్తున్నారు. 

3 Min read
narsimha lode
Published : Oct 31 2021, 08:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115

ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ  ఎన్నికలకు ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసింది. అయితే గులాబీ బాస్ కరుణ ఎవరికి దక్కుతుందోననే సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ పదవి కోసం పార్టీ నేతలు kcrను ప్రసన్నం చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

215

Mla కోటా mlc ఎన్నికలకు Election Commission ఇవాళ షెడ్యూల్ ను విడుదల చేసింది.  Telanganaలోని ఆరు స్థానాలు, Andhra pradeshరాష్ట్రంలోని మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.

315
gutta sukender reddy

gutta sukender reddy


తెలంగాణ రాష్ట్రంలోని ఆకుల లలిత, మహ్మద్ ఫరీదుద్దీన్, గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్, బోడకుంటి వెంకటేశ్వర్లు, కడియం శ్రీహరిల ఎమ్మెల్సీ పదవీకాలం ఈ ఏడాది జూన్ 3వ తేదీన ముగిసింది.

415

అయితే కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణను ఈసీ వాయిదా వేసింది. ఈ ఎన్నికలకు ఈ ఏడాది నవంబర్ 9వ తేదీన ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది ఈసీ.ఈ ఏడాది నవంబర్ 29న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్లను లెక్కించనున్నారు.
 

515

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ  మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.చిన్న గోవింద్ రెడ్డి, మహ్మద్ అహ్మద్ షరీఫ్, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే 31న ముగిసింది.

615

తెలంగాణలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాలు Trsకే దక్కుతాయి. అయితే ఈ ఆరు స్థానాల కోసం ఆశావాహుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైన వారిలో ఎందరికీ తిరిగి రెన్యూవల్ చేస్తారనే చర్చ టీఆర్ఎస్‌లో సాగుతుంది.

715

శాసనమండలి ఛైర్మెన్ గా పనిచేసిన గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిలకు మరోసారి ఎమ్మెల్సీ పదవులను రెన్యువల్ చేస్తారా లేదా అనే చర్చ నెలకొంది. ఇటీవల వరంగల్ జిల్లా పర్యటనకు కేసీఆర్ వెళ్లిన సమయంలో కడియం శ్రీహరి ఇంట్లోనే సీఎం కేసీఆర్ మధ్యాహ్న భోజనం చేశారు

815
ktr

ktr

అంతకుముందు కేటీఆర్ వరంగల్ జిల్లా టూర్ కు వెళ్లిన సమయంలో కూడా శ్రీహరి ఇంటికి వెళ్లారు. అయితే శ్రీహరికి ఎమ్మెల్సీని మరోసారి రెనివల్ చేస్తారా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు.. ఇదే జిల్లా నుండి బోడకుంట్ల వెంకటేశ్వర్లు కూడా ఎమ్మెల్సీ పదవీకాలం పూర్తైంది. ఆయనకు మరోసారి అవకాశం ఇస్తారా అనేది తేలలేదు.

915

ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుండి గుత్తా సుఖేందర్ రెడ్డి, నేతి విద్యాసాగర్ లున్నారు. సుఖేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి శాసనమండలి ఛైర్మెన్ గా  బాధ్యతలు ఇచ్చారు

1015
kcr

kcr

మరోసారి ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా లేదా అనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. సుఖేందర్ రెడ్డిని కేసీఆర్ తన మంత్రివర్గంలోకి తీసుకొంటారనే చర్చ గతంలో సాగింది. అందుకే ఆయనకు ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారనే ప్రచారం కూడా అప్పట్లో సాగింది. కానీ ఆయనకు శాసనమండలి ఛైర్మెన్ పదవిని కట్టబెట్టారు.

1115

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సందర్భంగా టికెట్ ఆశించిన ఎంసీ కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే కోటిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి.

1215
koushik reddy

koushik reddy

మరో వైపు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలను పురస్కరించుకొని గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కోసం కేసీఆర్ సర్కార్ సిఫారసు చేసింది. అయితే ఈ సిఫారసును గవర్నర్ పెండింగ్ లో పెట్టారు

1315
peddi reddy

peddi reddy

హుజూరాబాద్ ఉప ఎన్నికల ముందు మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. ఈ సమయంలో పెద్దిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని ఇస్తారనే కేసీఆర్ హామీ ఇచ్చారనే ప్రచారం కూడ సాగింది. అయితే పెద్దిరెడ్డికి ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతారా లేదా  ఇంకా కొత్తవారి పేర్లు తెరమీదికి వస్తాయా అనేది తేలాల్సి ఉంది.

1415
ramana

ramana

కౌశిక్ రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీకి రికమండేషన్ పంపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు

1515

మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, బానోతు రామ్మోహన్ లాంటి నేతలు కూడ ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు.

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved