కర్నూలు జిల్లా శ్రీశైలంలో పురాతన బంగారు నాణేలు బయటపడ్డాయి. స్థానిక ఘంటామఠంలో గత కొన్నాళ్లుగా పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం బంగారు నాణేలు లభ్యమయ్యాయి.

అదే ప్రదేశంలో ఇప్పటికే వెండి నాణేలు, తామ్ర శాసనాలు లభించాయి. ఇప్పుడు ఏకంగా బంగారు నాణేలు దొరకడం సంచలనం కలిగించింది. ఇవాళ జరిపిన తవ్వకాల్లో 15కి పైగా బంగారు నాణేలు, ఒక బంగారు ఉంగారం, 18 వెండి నాణేలు దొరికాయి.

శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారి ఆలయానికి వెనుక భాగంలో ఈ పురాతన ఘంటా మఠం వుంది. దీని పునర్నిర్మాణ పనుల్లో దొరికిన బంగారు, వెండి నాణేలు, తామ్ర శాసనాలను అధికారులు పరిపాలనా భవనంలో భద్రపరిచారు. 

Also Read:మల్లన్న కొలువుదీరిన శ్రీశైలంలో... వెండి నాణేలు, తామ్ర శాసనాలు లభ్యం