అనంతపురం: మహిళలపై దాడులకు సంబంధించి ప్రభుత్వాలు ఎన్నిచట్టాలు తీసుకువస్తున్నా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. రోజురోజుకు మహిళలపై ఆగడాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. 

నవంబర్ 27న తెలంగాణలో వైద్యురాలు దిశపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశమంతా దిశపై జరిగిన దారుణాన్ని ఖండిస్తుంది. దేశమంతా ఏకమై ఆదారుణానికి ఒడిగట్టిన నిందితులను ఉరితియ్యాలంటూ రోడ్డెక్కుతున్న పరిస్థితి. 

ఇలాంటి తరుణంలో ఓ శాడిస్టు భర్త తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దిశ ఘటన మరవకముందే తాళికట్టిన భార్యను తన స్నేహితులతోపాటు కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడిన ఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. 

అనంతపురం జిల్లా కదిరికి చెందిన మల్లేశ్ అనే వ్యక్తి తన భార్యపై అమానుషంగా ప్రవర్తించాడు. ఫూటుగా మద్యం తాగిన మల్లేశ్ తాళికట్టిన భార్య అనే కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించాడు. మాంగళ్య బంధాన్ని తుంగలో తొక్కాడు. 

justice for disha:ఆ మెుగుడు నాకొద్దు, ఉరితియ్యండి: దిశ హత్య కేసు నిందితుడి భార్య

భార్య కాళ్లు చేతులు కట్టేసి తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు. మద్యం మత్తులో తన స్నేహితులతో కలిసి తన భార్యపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. 

ఇకపోతే ఈ దారుణానికి ఒడిగట్టిన భర్త మల్లేశ్ గతంలో తొమ్మిదేళ్ల బాలిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే విడుదలయ్యాడు. జైలుకు వెళ్లి వచ్చిన మల్లేష్ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు. 

నిత్యం మద్యం తాగుతూ మానవ మృగంలా ప్రవర్తించేవాడు. అయితే బుధవారం మధ్యాహ్నాం ఫుల్ గా తాగిన మల్లేశ్ తన స్నేహితులతో కలిసి భార్యపై దారుణానికి ఒడిగట్టారు. భార్య పాలిట నరరూప రాక్షసుడిగా మారాడు.

పెప్పర్ స్ప్రే వద్దు కత్తిపట్టండి, వేధిస్తే చంపెయ్యండి: సినీనటి ఆగ్రహం

నలుగురు మానవ మృగాలు ఆ మహిళపై దారుణంగా ప్రవర్తించడంతో ఆమె ఆస్పత్రిపాలైంది. ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అంగన్ వాడీ కార్యకర్తల సహకారంతో బాధితురాలితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

భర్త మల్లేశ్ తోపాటు అతని స్నేహితులపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులుపై రేప్, మర్డర్ కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. 

Justice for Disha: నిందితుడికి ప్రాణాంతక వ్యాధి, ఆర్నెళ్లకోసారి