అనంతపురం: అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య వెనుక  సమీప బంధువుల ప్రమేయం ఉన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆధారాలను సేకరిస్తున్నారు.

బోయ నల్లప్ప, మీనాక్షిని నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు.ఈ పెళ్లిని మీనాక్షి తల్లి దండ్రులు వ్యతిరేకించారు. ఈ పెళ్లిని కూడ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. నల్లప్ప మీనాక్షిని పెళ్లి చేసుకొని గార్లదిన్నెలో  కాపురం పెట్టారు. వీరికి రితీష్, కీర్తి అనే ఇద్దరు పిల్లలున్నారు.

నల్లప్ప వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.సాయంత్రం పూట గుర్తు తెలియని వ్యక్తులు నల్లప్ప ఇంటి పరిసరాల్లో తిరిగినట్టుగా  స్థానికులు చెబుతున్నారు. మీనాక్షితో పాటు ఇద్దరి పిల్లలను హత్య చేసింది సమీప బంధువులేనని పోలీసులు అనుమానిస్తున్నారు.సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకొంటామని  పోలీసులు ప్రకటించారు

సంబంధిత వార్తలు

దారుణం: ఒకే కుటుంబంలో ముగ్గురి హత్య