అనంతపురం:అనంతపురం జిల్లా గార్లదిన్నెలో బుధవారం నాడు  దారుణం చోటు చేసుకొంది. ఒకే కుటుంబంలో తల్లితో పాటు ఇద్దరు పిల్లలను హత్యకు గురయ్యారు.ఇంట్లోనే ముగ్గురు హత్యకు గురయ్యారు. బుధవారం సాయంత్రం ఈ ఘటన  వెలుగు చూసింది. స్థానికులు  ఈ విషయాన్ని గుర్తించి  పోలీసులకు  సమాచారమిచ్చారు.

సంఘటనాస్థలాన్ని పోలీసులు సందర్శించి ఈ ఘటనకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. అసలు ఒకే కుటుంబంలో  ముగ్గురిని ఎవరు హత్య చేశారనే దానిపై  పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.