చంద్రబాబుకు షాక్: ఆనం పార్టీ మారడం ఖాయం?

Anam Narayana Reddy indicates change of TDP
Highlights

మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడం ఖాయమని అనిపిస్తోంది.

నెల్లూరు: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ మారడం ఖాయమని అనిపిస్తోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ విషయాన్ని పట్టిస్తున్నాయి. పార్టీ మారుతున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన వ్యాఖ్యలు చేశారు. 

ఎన్నో పదవులు చేపట్టానని, సమర్థంగా పని చేశానని అంటూ గౌరవమూ గుర్తింపూ లేని చోట ఉండలేనని ఆయన అన్నారు. దీంతో ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైదొలడం ఖాయమని అనిపిస్తోంది. 

ఆయన నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ప్రాంతంలోని పలువురు టీడీపి, కాంగ్రెసు నాయకులను కలుసుకున్ారు. తొలుత ఆయన కోటపోలూరు వెళ్లి, కొద్ది రోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న చెంగాళమ్మ ఆలయ ట్రస్టు బోర్డు చైర్మన్, తెలుగుదేశం నాయకుడు ఇసనాక హర్షవర్దన్ రెడ్డిని పరామర్శించారు .

ఆయనతో గంట పాటు చర్చలు జరిపిన తర్వాత ఆనం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా  కుటుంబ సన్నిహితులు, అనుచరులు, అభిమానులు ఉన్నారని, వారందరితో చర్చించి తన రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. 

కాంగ్రెసు నేత, జిల్లా గ్రంథాయల సంస్త మాజీ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, తదితరులతో ఆయన చర్చించారు .

loader