Asianet News TeluguAsianet News Telugu

ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రయాణం.. ఈ స్థాయికి వైసీపీ: అంబటి రాంబాబు

ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగి నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. 

ambati rambabu comments on ysrcp formation day ksp
Author
Guntur, First Published Mar 12, 2021, 6:01 PM IST

ఒక ఎంపీ, ఎమ్మెల్యేతో ప్రారంభమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దిన దిన ప్రవర్ధమానంగా ఎదిగి నేడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. వైసీపీ 11వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులో నిర్వహించిన సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మీద పోరాటం చేసి 151 స్థానాలను కైవసం చేసుకున్నట్లు తెలిపారు.

మేనిఫెస్టోకు పవిత్రత ఇచ్చిన పార్టీ ఏదైనా దేశంలో ఉంది అంటే అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని రాంబాబు స్పష్టం చేశారు. ఏపీలో వైసీపీ చాలా గొప్పగా ఎదిగిందన్న ఆయన.. వైఎస్ జగన్ పాలనతో భవిష్యత్ లో వైసీపీని ఓడించే శక్తి ఏ రాజకీయ పార్టీకి లేదని ధీమా వ్యక్తం చేశారు.

పంచాయతీ ఎన్నికల్లో వచ్చిన మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి అనుకూలమైన ఫలితాలు వస్తాయని అంబటి జోస్యం చెప్పారు. ఈ ఎన్నికల తరువాత టీడీపీ ఉనికి లేకుండా పోతుందని.. ఆ పార్టీకి రాబోయే శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకని పరిస్థితి ఏర్పడనుందన్నారు.

Also Read:11వ వసంతంలోకి వైఎస్సార్‌సీపీ.. వైఎస్ జగన్ భావోద్వేగం

ఓటమి కంటే పోటి చేయకుండా ఉండటమే మేలు అనుకునే పరిస్ధితి వస్తుందని రాంబాబు జోస్యం చెప్పారు. సత్తెనపల్లిలో పది సీట్లకు అభ్యర్థులు దోరకని దుస్థితి టీడీపీదని ఆయన ఎద్దేవా చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో సత్తెనపల్లిలో ప్రశాంత వాతావరణం చెడగొట్టానికి ప్రతిపక్ష పార్టీ నాయకులు ప్రయత్నించారని అంబటి ఆరోపించారు.

రాజకీయ శత్రువులు వ్యక్తిగతంగా శత్రువులుగా మారకుడదని ఆయన హితవు పలికారు. పోలింగ్ జరిగే సమయంలో బూత్ దగ్గరకు టీడీపీ నాయకులు రావటం సమంజసం కాదని అంబటి రాంబాబు అన్నారు.

దీనికి మాజీ ఎమ్మెల్యే వైవి ఆంజనేయులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ప్రశాంతంగా పోలింగ్ చేసుకోవటానికి సహకరించాలని.. గొడవలు పడతాం, ఘర్షణ పడతాం అంటే చూస్తు ఉరుకోమని రాంబాబు హెచ్చరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios