మోడీ, చంద్రబాబు మహానటులు.. చంద్రబాబు జీవించేస్తారు:అంబటి

ambati rambabu comments on tdp-bjp
Highlights

కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం.. అనంతరం లోక్‌సభలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు

కేంద్రప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడం.. అనంతరం లోక్‌సభలో జరిగిన పరిణామాలపై వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేకహోదా అంశాన్ని వైసీపీ సజీవంగా ఉంచిందని.. హోదా అంశాన్ని సమాధి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధానితో కలిసి అనేక ప్రయత్నాలు చేశారని రాంబాబు ఆరోపించారు..

అవిశ్వాసం సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా బీజేపీ, టీడీపీల లాలూచీ బయటపడిందని.. కేంద్రం కుంభకోణాలు చేసిందని ఊదరగొడుతున్న తెలుగుదేశం పార్టీ.. అలాగే రాష్ట్రంలో టీడీపీ అవినీతి గురించి మాట్లాడే బీజేపీ నేతలు పార్లమెంట్‌లో నిన్న ఎందుకు ప్రశ్నించలేదని.. రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు, కేసీఆర్ మధ్య మోడీ ఏం పంచాయతీ చేశారో చెప్పాలని అంబటి డిమాండ్ చేశారు. 

loader