న్యూఢిల్లీ: అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని  కోరుతూ  అమరావతి మహిళా జేఏసీ నేతలు బుధవారం నాడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. 

also read:చంద్రబాబుకి జగన్ కౌంటర్: విశాఖపై వైసీపీ ప్లాన్ ఇదీ...

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరమీదికి తెచ్చింది. విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూల్ లో న్యాయ రాజధాని, అమరావతిలో శాసన రాజధానిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ  జేఏసీ నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. 

also read:అమరావతి ల్యాండ్ స్కాంపై సీబీఐ విచారణ కోరాం: వైసీపీ ఎంపీ మాధవ్

అమరావతికి చెందిన మహిళా జేఏసీ నేతలు  ఇవాళ కేంద్ర హోం శాఖ మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. కేంద్ర హోం శాఖ సెక్రటరీ అజయ్ భల్లాను కూడ కలిసి వినతి పత్రం సమర్పించారు.తమకు న్యాయం చేయాలని జేఏసీ నేతలు కేంద్ర హోంశాఖ మంత్రిని కోరారు. రైతులకు న్యాయం చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని కోరుతూ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులను  నిరసిస్తూ అమరావతి రైతులు ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.