జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు రాజధాని రైతులు. రాజధానికి తామంతా భూములు ఇచ్చామని అయితే బొత్స చేసిన వ్యాఖ్యలతో తమకు గందరగోళం నెలకొందని రైతులు పవన్ కు మెురపెట్టుకున్నారు.
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రైతులు నడుం బిగించారు. రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలతో గందరగోళానికి గురైన రైతులు పోరాటాన్ని తీవ్రతరం చేశారు.
రాష్ట్రంలోని అన్ని పార్టీల నేతలతో వారు వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. తమ సమస్యలపై ఏకరువు పెట్టుకున్నారు.
తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు రాజధాని రైతులు. రాజధానికి తామంతా భూములు ఇచ్చామని అయితే బొత్స చేసిన వ్యాఖ్యలతో తమకు గందరగోళం నెలకొందని రైతులు పవన్ కు మెురపెట్టుకున్నారు.
రాజధాని సమస్యలపై పోరాటానికి మద్దతు పలకాలని పవన్ కళ్యాణ్ ను కోరారు. రాజధాని అమరావతి నుంచి తరలిపోతుందంటూ వస్తున్న వార్తలు తమను ఆందోళనకు గురి చేస్తోందన్నారు.
రాజధాని ముంపు పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారంపై రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. రాజధానికి భూములు ఇచ్చామని కానీ నేటి వరకు కౌలు చెల్లించలేదని రాజధాని రైతులు పవన్ కు మెురపెట్టుకున్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 24, 2019, 2:58 PM IST