వైసీపీ తరపున గెలిచిన భూమా కుటుంబం టిడిపిలోకి ఫిరాయించిందన్న విషయం అందరికీ తెలిసిందే. బయటకు చెప్పుకోవటానికి వారు టిడిపి నేతలు. కానీ సాంకేతికంగా మాత్రం వైసీపీ సభ్యులే. అందుకు అసెంబ్లీ వెబ్ సైట్ గానీ ఎన్నికల సంఘం వెబ్ సైట్ గానీ చూస్తే అర్ధమవుతుంది. అంటే ఎన్నికల సంఘం వారిని టిడిపి సభ్యులుగా గుర్తించదు.
‘తన తండ్రి భూమానాగిరెడ్డి ఎంఎల్ఏగా చనిపోయారు కాబట్టి తమ అభ్యర్ధి ఏకగ్రీవంగా గెలవటానికి మిగిలిన పార్టీలు సహకరిచాలి’ ఇది మంత్రి అఖిలప్రియ లా పాయింట్. తన వాదనకు మద్దతుగా ఆళ్ళగడ్డలో తన తల్లి శోభానాగిరెడ్డి మరణించినపుడు తాను ఏకగ్రీవమవ్వటానికి అప్పట్లో చంద్రబాబు ఆళ్ళగడ్డలో టిడిపి తరపున ఎవరినీ పోటీ పెట్టలేదట. అదేవిధంగా వైఎస్ మరణం తర్వాత విజయమ్మను ఏకగ్రీవం చేయటానికి కూడా అప్పట్లో చంద్రబాబు సహకరించారట. అందుకనే ఇపుడు నంద్యాలలో వైసీపీ పోటీ పెట్టకూడదన్నది అఖిల ఆలోచన.
ఎలాగుంది అఖిల ఆలోచన? మంత్రి మాటలు వింటుంటే నవ్వు కూడా రావటం లేదు. ఎందుకంటే, అఖిల అర్ధం లేని లాజిక్కులతో మాట్లాడుతున్నారు. శోభానాగిరెడ్డి, వైఎస్ మరణాల తర్వాత అఖిలప్రియ, విజయమ్మల ఏకగ్రీవానికి చంద్రబాబు సహకరించారన్నది వాస్తవమే. అయితే, అప్పట్లో అది సజావుగా జరిగిన ప్రక్రియ.
ఇక్కడే మంత్రి చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అఖిలప్రియ అప్పట్లో ఏపార్టీ తరపున గెలిచారు? ఇపుడు ఏ పార్టీలో ఉన్నారు? అదే విధంగా భూమా నాగిరెడ్డి ఏ పార్టీ తరపున గెలిచారు, చనిపోయేనాటికి ఏ పార్టీలో ఉన్నారన్నది గమనించాలి. గెలిచింది వైసీపీ తరపునైతే, చనిపోయేనాటికున్నది టిడిపిలో. సమస్య అంతా ఇక్కడే వస్తోంది.
వైసీపీ తరపున గెలిచిన భూమా కుటుంబం టిడిపిలోకి ఫిరాయించిందన్న విషయం అందరికీ తెలిసిందే. బయటకు చెప్పుకోవటానికి వారు టిడిపి నేతలు. కానీ సాంకేతికంగా మాత్రం వైసీపీ సభ్యులే. అందుకు అసెంబ్లీ వెబ్ సైట్ గానీ ఎన్నికల సంఘం వెబ్ సైట్ గానీ చూస్తే అర్ధమవుతుంది. అంటే ఎన్నికల సంఘం వారిని టిడిపి సభ్యులుగా గుర్తించదు. రేపటి రోజున నంద్యాల ఉపఎన్నిక షెడ్యూల్ ప్రకటించినా అందులో భూమా నాగిరెడ్డిని వైసీపీ సభ్యునిగానే చెబుతుంది ఎన్నికల సంఘం.
అంటే అర్ధమేమిటి? చనిపోయిన భూమా నాగిరెడ్డి వైసీపీ సభ్యుడేనని. ఇపుడు అఖిల చెబుతున్నట్లు నంద్యాలలో పోటీ లేకుండా ఏకగ్రీవం చేయాలంటే వైసీపీ ప్రకటించే అభ్యర్ధినే ఏకగ్రీవం చేయాలి. ఇంత చిన్న విషయం అఖిలకు తెలీక కాదు మాట్లాడుతున్నది. వెనక నుండి మాట్లాడిస్తున్న వారు అలా మాట్లాడిస్తున్నారు.
