అమరావతి: సినీనటుడు ఆపరేషన్ గరుడ సృష్టి కర్త శివాజీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. చుక్కల భూముల సమస్యలు పరిష్కరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని చంద్రబాబు చెప్పడంతో స్పందించిన ఆయన శివాజీ నీకు ఆ అవకాశం ఇవ్వను అంటూ సెటైర్ వేశారు. 

చుక్కల భూముల సమస్యలపై సీఎం చంద్రబాబును సినీ నటుడు శివాజీ అమరావతిలో కలిశారు. చుక్కల భూముల సమస్యపై చర్చించారు. చుక్కల భూములతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పరిష్కరించకుంటే పోరాటం చేస్తానని చంద్రబాబుకు స్పష్టం చేసినట్లు తెలిపారు. దాంతో స్పందించిన సీఎం నీకు అవకాశం ఇవ్వను ఇప్పటికే కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చానని చెప్పినట్లు చెప్పుకొచ్చారు. చంద్రబాబుతో ఎలాంటి రాజకీయ అంశాలు చర్చించలేదన్నారు.  
 
ఇకపోతే  చుక్కల భూముల వ్యవహారంలో కొందరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని శివాజీ ఇటీవలే ఆరోపించారు. ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఈ ఫైల్ పై చర్చ రాకుండా అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. 

కనీసం మంత్రుల మాటలను కూడా కొందరు కలెక్టర్లు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆ అధికారులకు రాజకీయ పార్టీలంటే ఇష్టమని అంత ఇష్టం ఉన్నవాళ్లు పదవులకు రాజీనామా చేసి ఆయా పార్టీల్లోకి వెళ్లాల్సిందని చెప్పారు. చుక్కభూముల సమస్యలను సంక్రాంతిలోపు ఆమరణ దీక్ష చేపడతానని శివాజీ హెచ్చరించారు.

 

ఈ వార్తలు కూడా చదవండి

బాబు, పవన్ పొత్తు: శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు

టీడీపీలో చేరితే తప్పేంటీ: రాజకీయాల్లోకి హీరో శివాజీ

జగన్ టార్గెట్ సీఎం కుర్చీ, చంద్రబాబును గద్దె దించే కుట్ర: సినీనటుడు శివాజీ