సిగ్గు..సిగ్గు..వీళ్ళా మన ప్రజా ప్రతినిధులు?

According to adr 5 cases were booked on tdp mlas on various sections
Highlights

  • ఢిల్లీ కేంద్రంగా తెలుగు తమ్ముళ్ళు రాష్ట్రం పరువు తీసేసారు.
  • దేశవ్యాప్తంగా మహిళలను వేధిపులకు గురిచేసిన ప్రజాప్రతినిధుల్లో టిడిపిలోని ఐదుగురిపై కేసులున్నట్లు ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్స్మ్స్) ప్రకటించింది.
  • పార్టీల వారీగా ప్రజాప్రతినిధుల లెక్కలు తీస్తే టిడిపికి నాలుగో స్ధానం దక్కింది లేండి.
  • మహిళలకు తాను రక్షణగా ఉంటానని, వేధింపులను ఎట్టి పరిస్దితిలోనూ అంగీకరించేది లేదని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. 

ఢిల్లీ కేంద్రంగా తెలుగు తమ్ముళ్ళు రాష్ట్రం పరువు తీసేసారు. దేశవ్యాప్తంగా మహిళలను వేధిపులకు గురిచేసిన ప్రజాప్రతినిధుల్లో టిడిపిలోని ఐదుగురిపై కేసులున్నట్లు ఏడీఆర్(అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్స్మ్స్) ప్రకటించింది. పార్టీల వారీగా ప్రజాప్రతినిధుల లెక్కలు తీస్తే టిడిపికి నాలుగో స్ధానం దక్కింది లేండి. వివిధ పార్టీల్లోని  ప్రజాప్రతినిధుల ఎన్నికల అఫిడవిట్లను పరిశీలించిన ఏడిఆర్ ఈ మేరకు లెక్కలు కట్టింది.

టిడిపికి చెందిన వారిలో ఇద్దరు మంత్రులు, ముగ్గరు ఎంల్ఏలపై కేసులున్నట్లు నివేదిక చెబుతోంది. 14మంది ఎంఎల్ఏలు, ఎంపిలతో మొదటిస్ధానంలో భారతీయ జనతా పార్టీ ఉండగా, ఏడుగురు ప్రజాప్రతినిధులతో రెండో స్ధానంలో శివసేన, ఆరుగురు ఎంఎల్ఏలతో మూడోస్ధానంలో తృణమూల్ కాంగ్రెస్ ఉండగా నాలుగో స్ధానంలో టిడిపి నిలిచింది.

టిడిపికి సంబంధించి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయడు, చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్, పెందుర్తి ఎంఎల్ఏ బండారు సత్యనారాయణమూర్తి, అనంతపురం జిల్లా ధర్మవరం ఎంఎల్ఏ గోనుగుంట్ల సూర్యనారాయణలపై వివిధ కేసులున్నాయి. గోనుగుంట్లపై కిడ్నాప్, అత్యాచారం కేసుంది.

దేవినేనిపై మహిళను వేధించటం, అసభ్యపదజాలంతో దూషించటంపై కేసు నమోదైంది. కింజరాపుపై మహిళా వేధిపుల కేసు నమోదైంది. చింతమనేనిపై ఏకంగా 20 కేసులున్నాయి. బండారుపై మహిళలను ఉద్దదేశ్యపూర్వకంగా అవమానించి వేదించిన కేసుతో పాటు మరోనాలుగు కేసులున్నాయి. ఇవి తమ్ముళ్ళ ఘనత. వీళ్ళంతా మహిళా సాదికారత గురించి జనాలకు నీతులు చెబుతుంటారు.

మహిళలకు తాను రక్షణగా ఉంటానని, వేధింపులను ఎట్టి పరిస్దితిలోనూ అంగీకరించేది లేదని చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పారో లెక్కేలేదు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మహిళలపై దాడులు, అత్యాచారాలు లాంటి కేసులు తమ్ముళ్ళపై ఎన్ని వస్తున్న ఆరోపణలకు లెక్కేలేదు. రాష్ట్రంలో కలకలం సృష్టించిన ‘కాల్ మనీ సెక్స్ రాకెట్’ గురించి కొత్తగా చెప్పేదేముంది?

అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పై ఆయన కోడలు చేసిన ఆరోపణలు దీనికి అదనం. మహిళ వేధింపులపై ఎవ్వరిపైనా ఎటువంటి చర్యలు లేవు కాబట్టే తమ్ముళ్ళు రెచ్చిపోతున్నారు. ప్రతీరోజు వేదికలపైన మహిళ రక్షణ గురించి మాట్లాడే చంద్రబాబునాయుడు తన మంత్రివర్గం, పార్టీలోని ఐదుగురు ప్రజాప్రతినిధుల కేసుల విషయంపై మాత్రం చంద్రబాబు నోరిప్పరు.

 

loader