హో మంత్రికి గాయాలు లిఫ్ట్ వైర్ తెగటంతో ప్రమాదం అత్యవసర చికిత్స చేస్తున్న ఆసుపత్రి యాజమాన్యం

ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్పకు గాయాలయ్యాయి. మంగళవారం కాకినాడలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళారు. లిఫ్ట్ లో పై అంతస్తుకు వెళుతుండగా లిఫ్ట్ వైర్ తెగిపోవటంతో హోంమంత్రితో పాటు పలువురు పడిపోయారు.

ఈ ఘటనలో నిమ్మకాయలకు నడుం, కాలుపై గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఆసుపత్రి యాజమాన్యం మంత్రిని అత్యవసర చికిత్సల విభాగంలో చేర్పించి అత్యవసర చికిత్సను అందించారు. పెద్ద ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెద్దాపురం మండలంలోని కట్టమూరు వద్ద రొయ్యల శుద్ధి పరిశ్రమాలో అస్వస్ధతకు గురైనా బాధితులను పరామర్శించేందుకు వెళ్లినపుడు ప్రమాదం జరిగింది.