తనను పోలీసు స్టేషన్ కు పిలిపించి అవమానాలకు గురి చేశారని ఆరోపిస్తూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో జరిగింది.
విచారణ కోసమని పోలీసు స్టేషన్ కు పిలిచి అవమానించారని పేర్కొంటూ ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా కలకలం సృష్టించింది. దీనిని సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
CM Bommai Corona Positive: కర్ణాటక సీఎంకు కరోనా పాజిటివ్ .. ఢిల్లీ పర్యటన రద్దు..
కృష్ణా జిల్లాలోని కంకిపాడు ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల రాజులపాటి అరవింద్ బెంగళూరులో నివసిస్తుంటాడు. అక్కడే ఉంటూ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే తన స్వస్థలం అయిన కంకిపాడులో ఇంటికి ఎదురుగా ఓ పోలీసు స్టేషన్ ఉంటుంది. అరవింద్ ఇంట్లో అతడి తల్లిదండ్రులు ఉంటారు. పక్కనే ఉన్న మరో ఇంట్లో అతడి పిన్ని బాబాయ్ లు నివసిస్తుంటారు. ఇటీవల అరవింద్ తల్లికి పక్క ఇంట్లో ఉండే పిన్నికి గొడవలు అయ్యాయి. ఈ విషయం అతడికి తెలిసింది. దీంతో తన పిన్ని గతంలో వేరే వ్యక్తులతో ఫోన్ లో మాట్లాడిన కాల్ రికార్డింగ్స్ లను తమ్ముడు (పిన్ని కొడుకు)కి పంపించాడు. దీంతో తమ్ముడు వాళ్ల అమ్మను నిలదీశాడు. ఏంటిదని ప్రశ్నించాడు.
అర్పిత ప్రాణాలకు ముప్పు ఉంది.. జైల్లో ఆహారం, నీరు తనిఖీ చేయండి - ఈడీ తరుఫు న్యాయవాది
అయితే ఈ విషయంలో పిన్ని అరవింద్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను చాలా కాలం నుంచి వాయిస్ రికార్డులు అంటూ వేధిస్తున్నారని ఆరోపిస్తూ కేసు పెట్టింది. విచారణ కోసం పోలీసులు నిందితుడిని స్టేషన్ కు పిలిపించారు. అనంతరం ఇంటికి వెళ్లిన అతడు ఇంట్లో ఆత్మహత్య కు పాల్పడ్డాడు. స్థానికులు, ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. కానీ అక్కడ చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.
దళితుల హత్య కేసులో 27 మందికి యావజ్జీవం.. కోర్టు సంచలన తీర్పు
దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే మృతుడు చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్ ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో.. తన దగ్గర ఉన్న రికార్డులను తమ్ముడికి పంపించానని, వాటితో పిన్ని ప్రవర్తనను మారుస్తాడని తాను అనుకున్నాని పేర్కొన్నారు. చాలా ఏళ్లుగా తన ఫ్యామిలీని పిన్ని ఇబ్బందులు పెడుతోందని అందులో తెలిపాడు. తాను ఆమెతో ఆరు సంవత్సరాలుగా మాట్లాడటం లేదని అలాంటి ఆమెను ఎలా వేధిస్తానని ప్రశ్నించాడు. తనపై పిన్ని చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజమూ లేదని పేర్కొన్నాడు. ఎంక్వేరీ సందర్భంగా కానిస్టేబుల్ కొట్టాడని, బూతులతో తిట్టాడని దీంతో తనకు జీవితం మీద విరక్తి వచ్చిందని తెలిపారు. నిందితులకు కూడా మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వాలని సబ్ ఇన్స్పెక్టర్ ను వేడుకుంటున్నానని ఆ సూసైడ్ నోట్ లో అరవింద్ పేర్కొన్నాడు.
ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే 9152987821 అనే ప్రభుత్వ హెల్ప్ లైన్ నెంబర్ కు కాల్ చేయండి. వారు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు.
