ఆనం వివేకా తన గురించి తానేమన్నారంటే (వీడియో)

ఆనం వివేకా తన గురించి తానేమన్నారంటే (వీడియో)

నెల్లూరు డైనమిక్ లీడర్ గా పేరుగాంచిన ఆనం వివేకానందరెడ్డి ఇక లేరన్న వార్త ఆయన అభిమానులనే కాదు.. యావత్ తెలుగు ప్రజలను కూడా కలచివేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన ఎమ్మెల్యేగా తెలుగు ప్రజలందరికీ సుపరిచితులు. ఆయన హావభావాలు, చేష్టలతో తెలుగు ప్రజల్లో స్థానం సంపాదించుకున్నారు. ఆనం ఏది చేసినా ఒక దశలో సంచలనంగా మారిన దాఖలాలున్నాయి.

కాంగ్రెస్ లో ఒక వెలుగు వెలిగిన ఆనం సోదరులు రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడి టిడిపి గూటికి చేరారు. అయితే టిడిపిలో ఆనం సోదరులకు అంతగా ప్రాధాన్యత దక్కలేదన్న అసంతృప్తితో ఉన్నారు. దీంతో గత కొంత కాలంగా ఆనం సోదరులు టిడిపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. ఇంతలోనే ఆనం వివేకానందరెడ్డికి జబ్బు చేయడం, ఆయన మంచానపడి కోలుకోలేక మంగళవారం తుది శ్వాస విడిచారు.  

అయితే ఆనం వివేకానందరెడ్డి రాజకీయాలు చివరి దశలో ఉన్న సమయంలో మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా సర్కూలేట్ అవుతోంది. తనకు నెల్లూరుకు ఉన్న బంధం ఎటువంటిదో? తనకు రాజకీయాలకు ఉన్న సంబంధం ఎలాంటిదో? తనకు తన తమ్ముడికి ఉన్న మమకారం ఎలా ఉంటుందో? అనేక విషయాలను ఆనం మాట్లాడారు. ఆ వీడియో పైన ఉంది ఆనం ఏమన్నారో మీరూ చూడండి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos