లోయలోపడిన లారీ

చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పెద్దవంక సమీపంలో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయలతో లోడుతో వెళుతున్న లారీ లోయలోపడిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

లారీ కింద సుమారు 10 మంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. చనిపోయినవారంతా తమిళనాడుకు చెందిన కూలీలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.