తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దూషించిన కేసులో పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జిలను అరెస్ట్  చేసి.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

మరోవైపు తాడికొండ సీటును వైసీపీ దక్కించుకుందనే అక్కసుతో... తన మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. తాను పూజ చేస్తే దేవుడు మైల పడతాడని దూషించడమే కాకుండా... తనపై వారు దాడికి సైతం పాల్పడ్డారని శ్రీదేవి వాపోయారు.

అసలు వినాయక విగ్రహాన్ని తయారు చేసినవారు దళితులేనని టీడీపీ నేతలు గుర్తుంచుకోవాలని.. రాజధాని ప్రాంతంలోని అక్రమాలు వెలికి తీస్తున్నందునే తనపై దాడి చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.

కాగా.. వినాయక చవితి సందర్భంగా తుళ్లురు మండలం అనంతవరంలో ఏర్పాటు చేసిన గణేశ్ మంటపం వద్దకు ఎమ్మెల్యే శ్రీదేవి వెళ్లారు. అయితే ఎమ్మెల్యే లోపలికి వస్తే వినాయకుడు మైలపడతాడని కొందరు టీడీపీ నేతలు అసభ్యపదజాలంతో దూషించారు. వారి వ్యాఖ్యలతో మనస్తాపానికి గురైన శ్రీదేవి కంటతడి పెట్టడం వివాదానికి దారి తీసింది. 

అవమానిస్తున్నారు: టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి: నలుగురిపై కేసు

టీడీపీ నేతల దూషణలు: కన్నీళ్లు పెట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి