టీడీపీ నేతల దూషణలు: కన్నీళ్లు పెట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి
టీడీనీ నేతలు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించారు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు.

అమరావతి: గుంటూరు జిల్లాలోని అనంతవరంలో టీడీపీ నేతలు స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని దూషించారు. దీంతో ఆమె కన్నీళ్లు పెట్టుకొన్నారు. గణేష్ చవితిని పురస్కరించుకొని పూజల్లో పాల్గొనేందుకు వచ్చిన శ్రీదేవిపై టీడీపీ నేతలు అభ్యంతకరంగా మాట్లాడారు.
సోమవారం నాడు గణేష్ చవితిని పురస్కరించుకొని అనంతవరంలో పూజలు నిర్వహించేందుకు ఎమ్మెల్యే శ్రీదేవి వచ్చారు. ఈ సమయంలో కొందరు టీడీపీ శ్రేణులు ఎమ్మెల్యే పూజలు నిర్వహిస్తే దేవుడు మైలపడతాడని కామెంట్ చేశాడు. దీంతో ఎమ్మెల్యే మనస్తాపానికి గురయ్యారు. ఈ వ్యాఖ్యలతో ఎమ్మెల్యే శ్రీదేవి కన్నీళ్లు పెట్టుకొన్నారు.