అమరావతి: తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని దూషించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి వినాయక మండపం వద్ద  పూజ చేసే సమయంలో  టీడీపీ నేతలు దూషించారని  వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

వినాయక మండపంలో  దళితులు పూజ చేస్తే దేవుడికి మైల అంటుతుందని టీడీపీకి చెందిన వారు దూషించారని వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఈ వ్యాఖ్యలతో  ఎమ్మెల్యే కన్నీళ్లు పెట్టుకొన్నారు. 

తాడికొండ ఎమ్మెల్యే  శ్రీదేవి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు మంగళవారం నాడు కేసు  నమోదు చేశారు.  కొమ్మినేని శివయ్య, సాయి, రామకృష్ణ, బుజ్జిలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే ఓ తాగుబోతు కుటుంబసభ్యులతో గొడవ పడుతున్న సమయంలో ఆ కుటుంబానికి చెందిన వాళ్లే ఆయనను సముదాయించే ప్రయత్నం చేశారని  మరికొందరు చెబుతున్నారు. ఎమ్మెల్యేను ఉద్దేశ్యపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదని వారు ఓ  టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 

సంబంధిత వార్తలు

టీడీపీ నేతల దూషణలు: కన్నీళ్లు పెట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి