భారీ వర్షాలతో దక్షిణ కోస్తా, రాయలసీమ అతలాకుతలం: రేపు జగన్ ఏరియల్ సర్వే
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏరియల్ సర్వే (aerial survey) నిర్వహించనున్నారు. కాగా... ఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధాని మోడీ (pm narendra modi) ఫోన్‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు
భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఏరియల్ సర్వే (aerial survey) నిర్వహించనున్నారు. కాగా... ఏపీలోని వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ప్రధాని మోడీ (pm narendra modi) ఫోన్‌లో మాట్లాడారు. వరద పరిస్థితులపై ప్రధాని ఆరా తీశారు. ప్రభుత్వ చర్యలను, 5 జిల్లాలోని వర్షాల పరిస్థితులను ప్రధాని మోడీకి సీఎం వైఎస్ జగన్ వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు.
మరోవైపు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాల (heavy rains) కారణంగా భయానక పరిస్ధితులు నెలకొన్నాయి. ఎడతెరిపిలేని వానలతో ఎక్కడికక్కడ నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అనంతపురం జిల్లాలో చిత్రావతి నది కూడా ఉగ్ర రూపుదాల్చింది. చిత్రావతి నదిలో ఓ కారు గల్లంతవగా, నదిలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు అగ్నిమాపక దళ సిబ్బంది, కొందరు స్థానికులు సాహసించారు. కారులోని వారితో సహా స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది మొత్తం 10 మంది తిరిగి బయటికి వచ్చే వీల్లేక నదిలోనే ఓ జేసీబీపైనే ఉండిపోయారు.
ALso REad:జగన్ కు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్: వరద పరిస్థితిపై ఆరా
అటు వరద ఉద్ధృతి అంతకంతకు తీవ్రమవుతుండటంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. వెంటనే అప్రమత్తమైన రాప్తాడు వైసీపీ (ysrcp mla) ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి (thopudurthi prakash reddy) అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న సీఎం జగన్ కు (ys jagan mohan reddy) దీనిపై సమాచారం అందించారు. దీనిపై వెంటనే స్పందించిన సీఎం జగన్ అనంతపురం జిల్లాకు ఓ హెలికాప్టర్ పంపించాలని అధికారులను ఆదేశించారు. హెలికాప్టర్ రావడంతో చిత్రావతి నదిలో చిక్కుకుపోయిన 10 మందిని కాపాడారు. ఎవరికీ ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇకపోతే.. శుక్రవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ (imd alert)హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్ష ప్రభావిత చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాలో వర్షాలు, వరదల పరిస్థితిని తెలుసుకున్న సీఎం జాగ్రత్తలు సూచించారు. ఈ మూడు జిల్లాల్లో భారీ వర్షాలు, వరద పరిపరిస్థితులకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వెంటనే చర్యలు తీసుకునేందుకుగాను ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది.