ఆరేళ్ల బాలికపై అత్యాచారం... నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు...

అభంశుభం తెలియని ఆరేళ్ల బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తికి పదేళ్ల జైలుశిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో ఆరేళ్ల తరువాత తీర్పు వెలువడింది.

10years imprisonment in a minor rape case in visakhapatnam

విశాఖపట్నం : బాలికపై Molestation జరిపిన కేసులో నిందితుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు వెయ్యి రూపాయల fine కూడా చెల్లించాలని court ప్రత్యేక న్యాయమూర్తి శ్రీనివాసరావు తీర్పునిచ్చారు. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు నెలల జైలు శిక్ష అనుభవించాలి అని న్యాయమూర్తి ఆదేశించారు. ఫోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ కరణం కృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  బాజీ జంక్షన్, కూరగాయల మార్కెట్ ప్రాంతానికి చెందిన చాపల శ్రీనివాసరావు (32) రాడ్ బెండర్ గా పని చేసేవాడు. బుచ్చి రాజుపాలెం, పైడితల్లమ్మ ఆలయం ప్రాంతానికి చెందిన బాలిక (6) 2016 జూలై 19న పైడితల్లమ్మ ఆలయం వద్ద ఒంటరిగా ఆడుకుంటుంది.

 శ్రీనివాసరావు బాలిక నోరు మూసి ఆలయం వెనుక భాగంలో  ఉన్న పాడు పడిన ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని తన తండ్రికి సంజ్ఞలతో తెలిపింది. తండ్రి ఫిర్యాదు మేరకు ఎయిర్పోర్ట్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుడు శ్రీనివాసరావు న్యాయస్థానంలో హాజరుపరిచారు. పరిశీలించిన  న్యాయమూర్తి పైవిధంగా శిక్ష విధించారు. 

ఇదిలా ఉండగా, ఇలాంటి ఘటనే ఫిబ్రవరి 4న మైసూరులో చోటు చేసుకుంది. ఆపదలో ఉన్న వారిని రక్షించాల్సిన పోలీస్ అధికారి అయి ఉండి mental condition సరిగా లేని యువతిని చెరబట్టిన కామాంధుడికి court కఠిన శిక్ష విధించింది. తుమకూరు నగరం వద్ద యువతిపై ఏఎస్ఐ ఉమేశయ్య అత్యాచారం చేసినట్లు నేరం రుజువు కావడంతో అతనికి 20 సంవత్సరాల imprisonmentతో పాటు.. లక్ష రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు జడ్జి హెచ్.ఎస్.మల్లికార్జునస్వామి  తీర్పు వెలువరించారు.

ఒంటరి యువతిని చూసి..
2017 జనవరి 14వ తేదీన రాత్రి ఒంటరిగా ఉన్న మతిస్థిమితం లేని యువతిని ఉమేశయ్య గస్తీకి వెళ్ళినప్పుడు చూశాడు. కొంతసేపటికి కారులో వచ్చి యువతిని బెదిరించి తీసుకెళ్లి molestation చేశాడు. మరుసటి రోజు ఈ దారుణం యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉమేశయ్యను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. 

ఉమేశయ్య నేరం చేసినట్టు కోర్టులో రుజువు కావడంతో శిక్ష తప్పలేదు. ప్రభుత్వ న్యాయవాది కవిత పకడ్బందీగా వాదనలు వినిపించారు. బాధితురాలికి  దోషి లక్ష రూపాయల జరిమానా అందించాలని ఆదేశించారు. కాగా, ఉమేశయ్య జీపు డ్రైవర్ పై నేరం నిరూపణ కాకపోవడంతో అతనికి విముక్తి కల్పించారు. ఈ తీర్పుపై ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ తీర్పు కామాంధులకు గుణపాఠం కావాలని పేర్కొన్నాయి.

ఇదిలా ఉండగా, ఇలాంటి దారుణమైన ఘటనే నిరుడు డిసెంబర్ చివర్లో తెలంగాణలోని నల్గొండలో వెలుగు చూసింది. మానసికస్థితి బాగోలేని బాలిక మీద ఏడు నెలలుగా Sexual assaultకి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన Nallagonda district మర్రిగూడ మండల కేంద్రం నుంచి చౌటుప్పల్ కు వెళ్లే దారిలో ఉన్న ఓ గ్రామంలో చోటు చేసుకుంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేని సమయంలో గ్రామానికి చెందిన ప్రభుత్వ చిరుద్యోగి ఒకడు బాలిక ఇంటికి వెళ్లి మాయమాటలు చెప్పి లొంగదీసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని తాగిన మైకంలో గ్రామానికి చెందిన తోటి స్నేహితులతో పంచుకున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన మరో ఆరుగురు కూడా ఆ బాలిక మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఇలా ఏడు నెలలుగా ఏడుగురు బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ఇటీవల ఆ బాలిక ఆరోగ్యం క్షీణించి, నీరసిస్తుండడంతో.. ఈ పరిస్థితిని గమనించిన తల్లి స్థానిక వైద్యుడు వద్దకు తీసుకువెళ్లింది. ఆ బాలికను పరీక్షించిన వైద్యుడు ఆమె గర్భవతి అని నిర్థారించారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios