Galam Venkata Rao | Published: Apr 24, 2025, 6:00 PM IST
జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమాయకుల మృతి పట్ల దేశం తల్లడిల్లింది. బీహార్ లోని మధుబనిలో జరిగిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఈ విషయాన్ని గుర్తుచేశారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కోసం 2 నిమిషాలు మౌనం పాటించి.. నివాళులు అర్పించారు.