Telangana Exam Results : తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులే కాదు వారి తల్లిదండ్రులు కూడా ఫలితాలకోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే పరీక్షా పత్రాల మూల్యాంకన పూర్తిచేసి ఫలితాల విడుదలకు సర్వం సిద్దం చేసింది విద్యాశాఖ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా బుధవారం ఫలితాలు విడుదల కానున్నాయి.
ఏప్రిల్ 30న తెలంగాణ పదోతరగతి విద్యార్థుల ఫలితాలను ప్రకటించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో ఈ ఫలితాల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు... మధ్యాహ్నం ఒంటిగంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా ఫలితాలను ప్రకటిస్తారని తెలిపారు.
24
Telangana Tenth Exam Results
విద్యార్థులు ఫలితాలను ఇలా చెక్ చేసుకొండి :
పదో తరగతి ఫలితాల కోసం విద్యార్థులు అధికారిక వెబ్ సైట్స్ https://bse.telangana.gov.in/ లేదా results.bse.telangana.gov.in ను సంప్రదించవచ్చు. ఇక్కడ హాల్ టికెట్, డేట్ ఆఫ్ భర్త్ ఆధారంగా విద్యార్థుల ఫలితాలను పొందవచ్చు. ఇక్కడే కాదు చాలా వైబ్ సైట్స్ పదో తరగతి ఫలితాలను అందిస్తాయి.
ఇక ఫోన్ లోనే కేవలం ఎస్ఎంఎస్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు. దీని కోసం TS10 ROLL NUMBER అని టైప్ చేసి 56263కు మెసేజ్ పంపిస్తే వెంటనే ఫలితాలు ఎస్ఎంఎస్ ద్వారా రానున్నాయి.
34
Telangana SSC Exam Results
ఈసారి పదో తరగతి ఫలితాల్లో మార్పులు :
ఇంతకాలం పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులకు కేవలం గ్రేడింగ్ మాత్రమే ఇచ్చేవారు... కానీ ఇకపై మార్కులను కూడా మెమోలో పొందుపర్చపనున్నారు. దీంతో గతంలో మాదిరిగా విద్యార్థులకు ఏ సబ్జెక్ట్ లో ఎన్నిమార్కులు వచ్చాయో తెలియనుంది.
రాత పరీక్షలో మార్కులతో పాటు బోధనేతర కార్యక్రమాల ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చేవారు. దీనివల్ల విద్యార్థులకు ఓ కన్ఫ్యూజన్ ఉండేది... ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు వచ్చాయో తెలిసేది కాదు. ఇది గమనించిన విద్యాశాఖ గతంలో మాదిరిగా మార్కులతో పాటు ఇప్పుడున్న గ్రేడింగ్ విధానంలో ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించింది. దీంతో విద్యార్థుల మెమోలొ మార్కులతో పాటు గ్రేడ్స్ కూడా ఉండనున్నాయి.
44
Telangana SSC Exam Results
తెలంగాణలో పది పరీక్షలు :
తెలంగాణలో గత నెల మార్చి 21 నుండి ఈనెల ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో కలిపి మొత్తం 5 లక్షలమందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాసారు. ఇలా ఓవైపు పరీక్షలు జరుగుతుండగానే మరోవైపు జవాబు పత్రాల మూల్యాంకన కూడా చేపట్టారు. దీంతో పరీక్షలు ముగిసిన నెల రోజుల్లోపే ఫలితాలను వెల్లడించగలుగుతున్నారు.
అయితే గతంలో మాదిరిగా కాకుండా ఫలితాల విడుదలలో మార్పులు చేపట్టారు... గ్రేడ్స్ తో పాటు మార్కులను కూడా మెమోలొ పొందుపర్చాలని నిర్ణయించారు. దీంతో ఫలితాలు విడుదలకు ఆలస్యం అయ్యిందని... లేదంటే ముందుగానే ఫలితాలను వెల్లడించేవారిమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు.