Today Rashi Phalalu: ఓ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం

Published : Apr 30, 2025, 05:30 AM IST
Today Rashi Phalalu: ఓ రాశివారికి వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం

సారాంశం

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 30.04.2025  బుధవారానికి సంబంధించినవి.

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

తలపెట్టిన పనులు కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అనుకున్నది అనుకున్నట్లుగా పూర్తి గలరు. అధికారులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులను అదుపు చేసుకొవాలి. వృత్తి వ్యాపారములు సంతృప్తి పొందగలరు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. అకారణ కలహాలు ఏర్పడగలవు. వాహన ప్రయాణాలయందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇతరుల  సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ముఖ్యమైన వస్తువులు జాగ్రత్తలు తీసుకొనవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం మహా శూరాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):
చేయి వ్యవహారములు నూతన ఉత్సాహంతోటి చేస్తారు. సంఘములో గౌరవం పలుకుబడి పెరుగుతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. వృత్తి వ్యాపారమునందు ధనాధాయం సంతృప్తికరంగా ఉండును. భార్య భర్తల మధ్య మనస్పర్ధలు తొలగి అన్యోన్యత చేకూరును. శారీరక శ్రమ పని ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి. తలచిన పనులలో విజయం సాధిస్తారు. ఓం బృహస్పతయే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):
ఆదాయ అభివృద్ధికి నూతన మార్గాలు అన్వేషణ చేస్తారు. పెండింగ్ వ్యవహారములు  పరిష్కరించగలరు. వృత్తి వ్యాపారములలో లాభించి రాణిస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేయు పనులలో కృషి అభివృద్ధి కనపడును. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు పొందుతారు. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పొందగలరు. ఈ రాశి వారు ఈ రోజు ఓం జగన్నాథాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):
ఉద్యోగమునందు అధికారులతో వివాదాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అనాలోచిత నిర్ణయాల వలన ఇబ్బందులుంటాయి. మానసిక శారీరక అలసటలు పెరుగును. కుటుంబ బాధ్యతలు పెరుగును.  ఆదాయానికి మించి ఖర్చులు ఏర్పడతాయి. కేసులు వివాదాల తీర్పులు మీకు ప్రతికూలంగా నుండును. బంధుమిత్రులతో టీ  అకారణంగా కలహాలు  ఏర్పడతాయి. మంచి ఆలోచనలు చేయుట వలన మనసు నందు ప్రశాంతత లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం కపీశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):
ప్రయత్న  కార్యములు ను పూర్తి చేస్తారు. బంధువర్గముతోటి సహాయ సహకారాలు అందుకోగలరు. సామాజిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీ అవసరాలకు నిమిత్తం సరిపడినట్లు ఆదాయాన్ని అందుకుంటారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబ వ్యక్తులచే గౌరవ మర్యాదలు సౌఖ్యములు పొందగలరు. ఈరోజు ఈ రాశి వారు. ఓం ధైత్య గురవే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):
ఊహించని విధముగా తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడం వలన మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగి ఒత్తిడికి లోనవుతారు. వస్తువులందు జాగ్రత్త అవసరం.  వ్యాపారం నందుఊహించని ధన వస్తు నష్టం రావచ్చు. దైవ సంబంధమైన కార్యక్రమంలో పాల్గొంటారు. కుటుంబ వ్యక్తుల సహకారములు ముఖ్యమైన పనులు పూర్తిచేసుకోవాలి. ఈరోజు ఈ రాశి వారు. ఓ మంగళ స్వరూపిణ్యై నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):
ఉద్యోగమునందు నిరత్సాహముగా నుండును. శారీరకంగా బలహీనంగా ఉంటుంది. ఖర్చులను అదుపు చేసుకుని వ్యవహరించవలెను. ప్రయాణమునందు జాగ్రత్త అవసరము. బంధువర్గముతో మనస్పర్ధలు రాగలవు. ప్రభుత్వ సంబంధిత పనులలో ఆటంకాలు. అ కారణ కలహాలు ఏర్పడగలవు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు రాగలవు. కుటుంబము నందు ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరము. ఈరోజు ఈ రాశి వారు ఓం ఆదిత్యాయనమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

చాలా రకాల పనులలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించును. ఉద్యోగము నందు సాధారణ పరిస్థితిలు ఉండగలవు. సత్కార్యాచరణ ఆచరిస్తారు. వృత్తి  వ్యాపారాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. విద్యార్థినీ విద్యార్థులకు సంతృప్తికరమైన ఫలితాలు ఏర్పడగలరు. చిన్న చిన్న అవకాశములు కూడా అందుపుచ్చుకొనవలెను. నిరుద్యోగులకు ఉపాధి మార్గములు ఏర్పడగలవు. బంధుమిత్రుడు తోటి కలిసి ఆనందంగా గడుపుతారు. ఈరోజు ఈ రాశి వారు ఓం అష్టలక్ష్మి విలాసాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):
తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికిని పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. గృహమునందు సమాజము నందు గౌరవ ఆదరణలు పొందగలరు. ఆదాయం అవసరములకు సరిపడు నట్లు లభించును. పనిముట్లు తో గాని యంత్రములతో గాని జాగ్రత్తగా ఉండవలెను. బంధుమిత్రులతో సఖ్యతగా మెలగవలెను. స్థిరాస్తి వ్యవహారములు చికాకులు పరచగలవు. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకొనవలెను. నీచ జన సహవాసము దురాలోచనలు కు దూరముగా ఉండవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం హనుమతే నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):
చేయి పనులలో లాభాలు ఉండగలవు. విద్యార్థిని విద్యార్థులకు చదువు యందు ప్రతిభ కనబరుస్తారు. కుటుంబ సభ్యులకు మాట పట్టింపులు రాగలవు. ఉద్యోగమునందు ఆదనప పనిభారములు పెరుగును. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. సమాజము నందు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. నూతన వస్తు వాహనాది కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారం నందు ఊహించని ధన లాభం కలుగును. ఈరోజు ఈ రాశి వారు ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.


కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):
ఉద్యోగులకు అధికారులతో వాదోపవాదములు ఏర్పడగలవు. చేసే పనుల్లో ఉత్సాహం తగ్గుతుంది. వృత్తి వ్యాపారములలో ఆశించనంత లాభాలు కనబడక నిరోత్సాహం ఏర్పడును. భార్య భర్తల మధ్య సఖ్యత తగ్గి వివాదాలకు దారితీయును. ఆర్థిక ఇబ్బందులున్న ఏదో ఒక విధముగా ధనము చేతికి అందుతుంది. వాహనం ప్రయాణాల యందు జాగ్రత్త అవసరము. చేసే పనుల్లో ఆలోచనలతోటి సమయస్ఫూర్తిగా వ్యవహరించవలెను. ఈరోజు ఈ రాశి వారు ఓం ఛాయా స్వరూపాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):
తలపెట్టిన పనులు పట్టుదలతోటి పూర్తి చేయవలెను. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సామాన్యంగా ఉండును. ఉద్యోగంలో పైఅధికారులతోటి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల వల్ల ఒత్తిడి పెరగొచ్చు. ఆరోగ్యం అనుకూలముగా ఉండను. ఆదాయానికి సమానంగా ఖర్చులు ఏర్పడను. దురాఆలోచనలకు వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఈరోజు ఈ రాశి వారు ఓం రుద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలు పొందండి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hanuman Zodiac signs: హనుమంతుడికి ఇష్టమైన రాశులు ఇవే
Zodiac signs: మీ కష్టం పగ వాడికి కూడా రాకూడదు.. 2026లో పాపం ఈ రాశులు..!