
Delhi Capitals vs Kolkata Knight Riders : ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మరో ఉత్కంఠభరిత పోరుకు డిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికయ్యింది. ఈ మ్యాచ్ మొత్తం ఒకెత్తయితే డిల్లీ ఆటగాడు చమీర పట్టిన క్యాచ్ మరో ఎత్తు... కళ్లుచెదిరే ఆ క్యాచ్ ఈ మ్యాచ్ కే హైలైట్ గా నిలిచింది.
డిల్లీ బౌలర్లను కెకెఆర్ ఉతికి ఆరేస్తున్న సమయంలో చమీర బౌండరీపై ఈ క్యాచ్ పట్టాడు. అప్పటికే కెకెఆర్ స్కోరు 200 దాటడంతో క్రీజులో అడుగు పెడుతూనే అనుకుల్ రాయ్ బ్యాట్ కు పనిచెప్పేందుకు చూసాడు. కానీ చమీర ముందు అతడు పప్పులు ఉడకలేవు. మిచెల్ స్టార్ బౌలింగ్ లో భారీ బౌండరీకి ప్రయత్నించాడు అనుకుల్... కానీ చమీర బౌండరీలైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో అనుకుల్ ఖాతా తెరవకుండానే పెవిలియన్ బాట పట్టాల్సివచ్చింది.
చిరుతలా కదులుతూ అమాంతం దూకి బంతిని ఒడిసిపట్టుకున్న చమీరను అభినందించకుండా ఉండలేకపోయాడు స్టార్క్. అతడు కాదు అభిమానుల సైతం చమీర ఫిల్డింగ్ కు ఫిదా అయిపోయారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా ఈ కళ్లుచెదిరే క్యాచ్ ఐపిఎల్ సూపర్ క్యాచ్ ల జాబితాలో... చమీర్ మంచి ఫీల్డర్ల జాబితాలో చేరిపోయాడు.