భారత్ దెబ్బకు పాక్ అబ్బ... వారం రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు లాస్

Published : Apr 29, 2025, 10:29 PM IST

పహల్గాం ఉగ్రదాడి జరిగి వారం రోజులు గడిచింది. ఈ దాడి భారత్ ను కాదు పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బతీసింది... అదెలాగో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
15
భారత్ దెబ్బకు పాక్ అబ్బ... వారం రోజుల్లోనే రూ.2 లక్షల కోట్లు లాస్
Pakistan Economy

తాను తీసుకున్న గోతిలో తానే పడ్డట్లు తయారయ్యింది ప్రస్తుతం పాకిస్థాన్ పరిస్థితి. భారత్ ను దెబ్బతీసేందుకు ఉగ్రవాదులను ఉసిగొల్పింది... దీని ఎఫెక్ట్ ఇప్పుడు పాక్ పైనే పడింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారతదేశంతో సంబంధాలను పూర్తిగా తెంచుకుంది... ఆ దేశంలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని నిలిపివేసింది. దీనివల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది.

25
Pakistan Economy

కుప్పకూలుతున్న పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌ : 

ఈ వారం అరంభంలోనే అంటే సోమవారం కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ KSE-100 సూచీ 1405 పాయింట్లు లేదా 1.22% క్షీణించి 114,063.90 వద్ద ముగిసింది. ఇలా ఏప్రిల్ 22 నుండి కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ఇప్పటివరకు 5494.78 పాయింట్లు లేదా 4.63% క్షీణించింది. కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 52.84 బిలియన్ డాలర్ల నుండి 50.39 బిలియన్ డాలర్లకు తగ్గింది.

35
Pakistan Economy

పహల్గాం దాడి తర్వాత రూ.2 లక్షల కోట్ల నష్టం

గత కొన్ని రోజుల్లో పాకిస్తాన్ షేర్ మార్కెట్‌కు 2.45 బిలియన్ డాలర్ల భారీ ఎదురుదెబ్బ తగిలింది. అంటే పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ షేర్ మార్కెట్‌కు దాదాపు రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లింది.

45
Pakistan Economy

పాకిస్తాన్‌లో చికెన్ కిలో రూ.800

పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయిలో ఉంది. బియ్యం కిలో రూ.340, గుడ్లు డజను రూ.332, పాలు లీటరు రూ.224, టమాటా కిలో రూ.150, ఆపిల్ కిలో రూ.288, చికెన్ కిలో రూ.800, బంగాళాదుంప కిలో రూ.105, ఉల్లిపాయ కిలో రూ.145కి అమ్ముడవుతున్నాయి.

55
Pakistan Economy

ఇక పాక్ లో తాగునీరు కూడా ప్రియమయ్యింది... ఇది ఆ దేశ దారుణ పరిస్థితిని తెలియజేస్తుంది. అక్కడ తాగునీరు లీటరుకు రూ.105కి అమ్ముడవుతోంది. భారతదేశంలో బాటిల్ నీటి ధర లీటరుకు కేవలం రూ.15 నుండి రూ.20 మాత్రమే.

Read more Photos on
click me!

Recommended Stories