Galam Venkata Rao | Published: Feb 16, 2025, 10:00 PM IST
Maha Kumbh Mela 2025: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. భార్య అమృత, కుమార్తె దివిజతో కలిసి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేశారు. గంగమ్మకు హారతులు సమర్పించి పూజలు చేశారు. అనంతరం ఫడ్నవీస్ మాట్లాడుతూ... కుటుంబంతో కలిసి మహా కుంభమేళాలో పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. కుంభమేళాలో భక్తితో పవిత్ర స్నానం చేసిన 50 కోట్ల మందిలో తాము ఉన్నందుకు సంతోషంగా భావిస్తున్నామని అమృత ఫడ్నవీస్ తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ధన్యవాదాలు తెలిపారు.