IPL PBKS vs CSK: Dhoni-Jadeja failed to win again.. Chennai suffered their 4th defeat against Punjab
IPL 2025 PBKS vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ మరో ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 2025 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. బ్యాటింగ్ లో దుమ్మురేపే ప్రదర్శనతో పంజాబ్ సూపర్ విక్టరీ అందుకుంది. చివరి ఓవర్ వరకు సాగిన ఈ మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది. విన్నింగ్ పరుగులు కావాల్సిన సమయంలో క్రీజులో ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజాలు ఉన్నారు. కానీ, మళ్లీ ఈ జోడీ చెన్నైకి విజయాన్ని అందించడంలో సక్సెస్ కాలేకపోయింది.
IPL PBKS vs CSK: Dhoni-Jadeja failed to win again.. Chennai suffered their 4th defeat against Punjab
చండీగఢ్‌లోని ముల్లాన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన చెన్నై జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఈ సీజన్‌లో పంజాబ్‌కు ఇది మూడో విజయం. ఐదు మ్యాచ్‌ల్లో చెన్నైకి ఇది వరుసగా నాలుగో ఓటమి. దీంతో పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలోకి చేరగా, చెన్నై సూపర్ కింగ్స్ 9వ స్థానంలోకి పడిపోయింది. మొదటి రెండు స్థానాల్లో ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ ఉన్నాయి.
IPL PBKS vs CSK: Dhoni-Jadeja failed to win again.. Chennai suffered their 4th defeat against Punjab
PBKS vs CSK: చివరి ఓవర్‌లో ఏం జరిగింది?
చివరి ఓవర్లో చెన్నై గెలవాలంటే 28 పరుగులు కావాలి. అయితే, క్రీజులో ఉన్నధోని, జడేజాలు మ్యాచ్ ను గెలిపించలేకపోయారు. ధోని 11 బంతుల్లో 27 పరుగులు చేశాడు. 20వ ఓవర్ తొలి బంతికే ధోనీ ఔటయ్యాడు. యష్ ఠాకూర్ వేసిన బంతికి యుజ్వేంద్ర చాహల్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. ధోని 12 బంతులు ఆడి ఒక ఫోర్, 3 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత విజయ్ శంకర్ సింగిల్ తీసుకున్నాడు. మూడో బంతికి రవీంద్ర జడేజా సిక్స్ కొట్టాడు. తరువాతి బంతికి ఒక్క పరుగు కూడా రాలేదు. ఐదవ బంతికి ఒక పరుగు వచ్చింది. చివరి బాల్ కు విజయ్ శంకర్ ఒక పరుగులు తీశాడు.
IPL PBKS vs CSK: Dhoni-Jadeja failed to win again.. Chennai suffered their 4th defeat against Punjab
220 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు శుభారంభం చేసింది. పవర్‌ప్లేలో రచిన్ రవీంద్ర, డెవాన్ కాన్వే కలిసి 59 పరుగులు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రాచిన్ 23 బంతుల్లో 36 పరుగులు చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు.
డెవాన్ కాన్వే, శివం దూబే మూడో వికెట్‌కు 51 బంతుల్లో 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూబే 27 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అతను 3 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. కాన్వే 49 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అతను 6 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. బ్యాటింగ్ నెమ్మదిగా ఉండటం వల్ల, అతను 18వ ఓవర్ ఐదవ బంతికి రిటైర్ అవుట్ అయ్యాడు. అతని స్థానంలో జడేజా క్రీజులోకి వచ్చాడు. అయితే, ఆ వ్యూహం పనిచేలేదు. జడేజా 5 బంతుల్లో ఒక సిక్సర్ తో 9 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. విజయ్ శంకర్ 2 బంతుల్లో 2 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.
IPL PBKS vs CSK: Dhoni-Jadeja failed to win again.. Chennai suffered their 4th defeat against Punjab
ప్రియాంష్ ఆర్య తొలి ఐపీఎల్ సెంచరీతో అదరగొట్టాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ యంగ్ ప్లేయర్ ప్రియాంష్ ఆర్య పంజాబ్ తరపున సెంచరీ చేసి సంచలనం సృష్టించాడు. ప్రియాంష్ చెన్నై బౌలర్లందరినీ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. తన 103 పరుగుల ఇన్నింగ్స్ లో ప్రియాంష్ 7 ఫోర్లు, 8 సిక్సర్లు కొట్టాడు. 245.24 స్ట్రైక్ రేట్ తో అతని బ్యాటింగ్ సాగింది. అతనితో పాటు, శశాంక్ సింగ్ 36 బంతుల్లో 52, మార్కో జాన్సెన్ 19 బంతుల్లో 34 పరుగులతో అజేయంగా నిలిచారు. ఖలీల్ అహ్మద్, రవిచంద్రన్ అశ్విన్ లు తలా రెండు వికెట్లు పడగొట్టారు.