Priyansh Arya: ప్రియాంష్ ఆర్య సెంచ‌రీ రికార్డులు ఇవే

IPL 2025 PBKS vs CSK: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ప్రియాంష్ ఆర్య దెబ్బ‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రో ఓట‌మిని చ‌విచూసింది. ఐపీఎల్ 2025 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి. అద‌రిపోయే బ్యాటింగ్ తో సునామీ సెంచ‌రీకొట్టాడు యంగ్ ప్లేయ‌ర్ ప్రియాంష్‌ ఆర్య‌.  ఈ  మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఓడిపోయింది. 
 

IPL 2025 PBKS vs CSK: 7 fours, 8 sixes... Priyansh Arya hit a century in 39 balls, set a series of records against CSK in telugu rma
Priyansh Arya. (Photo- IPL)

Priyansh Arya century records: ఐపీఎల్ 2025లో యంగ్ ప్లేయ‌ర్లు దంచికొడుతున్నారు. సునామీ బ్యాటింగ్ అదిరిపోయే ఇన్నింగ్స్ ల‌ను ఆడుతున్నారు. అలాంటి ప్లేయ‌ర్ల లిస్టులోకి ఢిల్లీ యంగ్ ప్లేయ‌ర్, పంజాబ్ త‌ర‌ఫున ఐపీఎల్ ఆడుతున్న ప్రియాంష్ ఆర్య కూడా వ‌చ్చి చేరాడు. త‌న తొలి ఐపీఎల్ సీజ‌న్ లోనే అద‌రిపోయే నాక్ ఆడాడు. తుఫాను సెంచ‌రీతో ఐపీఎల్ లో రికార్డుల మోత మోగించాడు. 

Priyansh Arya hit a century in 39 balls, set a series of records against CSK in IPL

ఐఎల్ 2025 22వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - పంజాబ్ కింగ్స్ త‌ల‌ప‌డ్డాయి.  ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ బ్యాట్స్‌మన్ ప్రియాంష్ ఆర్య త‌న తొలి సెంచ‌రీని సాధించాదు. అలాగే, ఇది ఐపీఎల్ 2025లో న‌మోదైన రెండో సెంచ‌రీ. చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు ప్రియాంష్ ఆర్య‌. ఈ క్ర‌మంలోనే త‌న సెంచ‌రీ ఇన్నింగ్స్ తో ప‌లు రికార్డులు సాధించాడు. 


Priyansh Arya hit a century in 39 balls, set a series of records against CSK in IPL

ప్రియాంష్ చెన్నై బౌలర్లందరినీ దంచికొట్టాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ప్రియాంష్ తన ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు. అత‌ని బ్యాటింగ్ 245.24  స్ట్రైక్ రేట్ తో సాగింది. మ‌రో బిగ్ షాట్ కొట్ట‌బోయి నూర్ అహ్మద్ బౌలింగ్‌లో విజయ్ శంకర్ కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. 

మ‌తీషా పతిరానా ఓవర్‌లో హ్యాట్రిక్ సిక్స‌ర్లు బాదిన ప్రియాంష్ ఆర్య 

ప్రియాంష్ ఆర్య చెన్నై స్టార్ బౌల‌ర్ మతిషా పతిరానా బౌలింగ్ ను దంచికొట్టాడు. గ్రేట్ లసిత్ మలింగ లాంటి యాక్షన్ తో బౌలింగ్ చేసే పతిరాన 13వ ఓవర్ లో బౌలింగ్ వేయడానికి వచ్చాడు. ఆ ఓవర్లో ప్రియాంష్ మూడు సిక్సర్లు కొట్టాడు. రెండవ, మూడవ, నాల్గవ బంతులను భారీ సిక్స‌ర్లుగా మ‌లిచాడు. ఐదవ బంతికి ఫోర్  కొట్టి త‌న సెంచ‌రీని పూర్తి చేశాడు. 

Punjab Kings' Priyansh Arya celebrates his half century during the match against Chennai Super Kings

ఐపీఎల్‌లో సెంచరీ చేసిన అన్‌క్యాప్డ్ ప్లేయర్లు

షాన్ మార్ష్ vs RR, 2008
మనీష్ పాండే vs DEC, 2009
పాల్ వాల్తాటి (KXIP) vs CSK, 2009
దేవదత్ పడిక్కల్ (RCB) vs RR, 2021
రజత్ పాటిదార్ (RCB) vs LSG, 2022
యశస్వి 2020 యశస్వాల్ (MIRR, Jaiswal20)
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ vs DC, 2023
ప్రియాంష్ ఆర్య (PBKS) vs CSK, 2025*

Priyansh Arya hit a century in 39 balls, set a series of records against CSK in IPL

మొదటి బంతికే సిక్స్ కొట్టిన ప్రియాంష్ ఆర్య 

పంజాబ్ ఇన్నింగ్స్ తొలి బంతికే ప్రియాంష్ సిక్స్ కొట్టాడు. తొలి ఓవర్లోనే ఖలీల్ అహ్మద్ వేసిన బంతిని బౌండరీకి ​​పంపాడు. అతని కంటే ముందు, ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో ముగ్గురు ఆటగాళ్ళు ఇలా చేశారు. 2009లో నమన్ ఓజా, 2019లో విరాట్ కోహ్లీ, 2024లో ఫిలిప్ సాల్ట్ ఈ ఘనత సాధించారు. 

ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ (బంతుల పరంగా)

30 - క్రిస్ గేల్ (RCB) vs PWI, బెంగళూరు, 2013
37 - యూసుఫ్ పఠాన్ (RR) vs MI, ముంబై BS, 2010
38 - డేవిడ్ మిల్లర్ (KXIP) vs RCB, మొహాలి, 2013
39 - ట్రావిస్ హెడ్ (SRH2 బెంగుళూరు, R20 RCB2
39 - ప్రియాంష్ ఆర్య (PBKS) vs CSK, ముల్లన్‌పూర్, 2025

ప్రియాంష్ ఆర్య ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన రెండో భారతీయుడిగా కూడా రికార్డు సాధించాడు. 

Latest Videos

vuukle one pixel image
click me!