ఆంధ్రుల అన్నగారు, నవరస నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. సినీ,రాజకీయ రంగాల్లో ఆయనది చెరగని ముద్ర. సినిమా రంగంలోనే హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, రైటర్, ఆకరికి మేకప్ ఆర్టిస్ట్ గా కూడా ఆయనకు అనుభవం ఉంది. అన్నింటి మీద గ్రిప్ సాధించారు కాబట్టే.. ఆ రోజుల్లో కూడా దానవీరశూరకర్ణ లాంటి అద్భుతాన్నిసీనియర్ ఎన్టీఆర్ తెరకెక్కించగలిగారు. ఇక రాజకీయంగా ఆయన రికార్డ్ ఎవరు చెరిపివేయలేకపోయారు.
ఇక సినిమాల పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ ఎనర్జీని తట్టుకుని నిలబడటం హీరోయిన్లకు చాలా కష్టంగా ఉండేదట. ఆయనతో నటించడం అంతా ఒక ఎత్తు అయితే.. ఎన్టీఆర్ తో పాటల షూటింగ్ అంతా ఒక ఎత్తు. డాన్స్ కాని, అభినయం కాని.. అన్నింట్లో పెద్దాయనతో పోటీ పడలేకపోయేవారట. ఇక హీరోయిన్ జయప్రద అయితే ఎన్టీఆర్ చేసిన పనివల్ల మూడు రజులు జ్వరం, ఒళ్ళు నొప్పులతో మంచం ఎక్కేసిందట. ఈ విషయాన్ని గతంలో జయప్రదం కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ తో శేర్ చేసుకుంది సీనియర్ తార.
జయప్రద హోస్ట్ గా జరిగిని ఆ ప్రోగ్రామ్ లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గోన్నారు. అప్పుడు జయ ప్రద మాట్లాడుతూ.. మీరు యమదొంగ సినిమాలో తాతగారి పాటను రీమిక్ చేశారు కదా.. ఒలమ్మీ తిగ్గరేగిందా సాంగ్. అప్పుడు ఆ హీరోయిన పరిస్థితి ఏంటి.? ఎందుకుంటే దాని ఒరిజినల్ సాంగ్ లో నేనే ఉన్నారు. మీ తాతగారు కొట్టిన దెబ్బలకు తట్టుకోలేక నాకు జ్వరం వచ్చింది. ఒళ్ళు నొప్పులతో మూడు రోజులు లేవలేదు. మరి మీ హీరోయిన్ పరిస్థితి ఏంటి అని అడిగారు.
దానికి జూనియర్ ఎన్టీఆర్ సమాధానం చెపుతూ.. మా హీరోయిన్ కు ఆ బాధ లేదండి. పెద్దగా దెబ్బలు పడలేదు. అందులో నేను అప్పట్లో ఉన్నట్టు కాస్త లావుగా ఉన్నట్టయితే.. ఆమెకు మీ పరిస్థితే వచ్చేదేమో. కాని అప్పటికి నేను సన్నబడ్డాను కదా? అందుకే పెద్దగా దెబ్బలు తగల్లేదు. కాస్త జాగ్రత్తగానే ఆపాటను షూట్ చేశాము అని అన్నారు ఎన్టీఆర్. అలా జయప్రద సీనియర్ ఎన్టీఆర్ తో తన పాత జ్ఞాపకాలను జూనియర్ ఎన్టీఆర్ తో పంచుకున్నారు.
Prashanth Neel, NTR Jr, kgf
ఇక ప్రస్తుతం జయప్రద సినిమాలకు, రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటు జూనియర్ ఎన్టీఆర్ తన నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ తో ప్రాజెక్ట్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. రీసెంట్ గా షాకింగ్ లుక్స్ లో కనిపించాడు తారక్. చాలా సన్నగా గుర్తు పట్టనంతగా మారిపోయాడు. తారక్ సినిమాకోసం అలా అయ్యాడా లేక ఇకేదైనా ఉందా అని అంతా ఆలోచనలో పడ్డారు.