నటి మాధురీ దీక్షిత్ టేక్వాండో నేర్చుకున్నారు. అందులో ఆరెంజ్ బెల్ట్ కూడా పొందారు. ఆమె భర్త, పిల్లలతో సహా మొత్తం కుటుంబం ఇందులో నిష్ణాతులు. 'గులాబ్ గ్యాంగ్' చిత్రం కోసం, ఆమె కుంగ్ ఫూ యొక్క పురాతన రూపాలలో ఒకటైన షావోలిన్ కుంగ్ ఫూ శిక్షణ పొందింది. ఆమెకు పెకిటి-టిర్సియా కాలి, షావోలిన్ చిన్ నా వంటి విద్యలు కూడా తెలుసు.
పరిణీతి చోప్రా 'కోడ్ నేమ్: తిరంగా' చిత్రంలోని పాత్ర కోసం మూడు నెలల పాటు 'క్రావ్ మగ' నేర్చుకున్నారు. క్రావ్ మగ ఇజ్రాయెలీ మార్షల్ ఆర్ట్, ఇది ఆచరణాత్మక, స్వీయ-రక్షణ పద్ధతులకు ప్రసిద్ధి చెందింది.
ప్రియాంక చోప్రా
బాలీవుడ్, హాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కరాటే, జు-జిట్సు, గట్కా సహా వివిధ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. 'ద్రోణ' చిత్రం కోసం ప్రియాంక చోప్రా సాంప్రదాయ సిక్కు మార్షల్ ఆర్ట్ గట్కాలో శిక్షణ పొందింది. ఈ శిక్షణ కష్ణతరమైన సాహసాలు చేయడానికి ఆమెకు అవకాశం కల్పించింది. యాక్షన్ థ్రిల్లర్ 'డాన్' కోసం తై చి, హాలీవుడ్ తొలి చిత్రం 'బేవాచ్' కోసం కజుకెన్‌బో నేర్చుకున్నారు.
దీపికా పదుకొణె
'చాందిని చౌక్ టు చైనా' చిత్రంలోని ద్విపాత్రాభినయం కోసం దీపికా పదుకొణె జుజుట్సు శిక్షణ పొందింది. ఆమె ఎంతో డెడికేషన్‌తో వాటిని నేర్చుకోవడం వల్ల యాక్షన్ సన్నివేశాలు బాగా రావడానికి దోహదపడ్డాయి. ఇది జపనీస్ మార్షల్ ఆర్ట్. అక్షయ్ కుమార్‌కు శిక్షణ ఇచ్చిన మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్స్ నుండి ఆమె శిక్షణ పొందింది.
సమంత
'హనీ బన్నీ' చిత్రంలోని సమంత క్లిష్టమైన యాక్షన్ లుక్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. శారీరకంగా డిమాండ్ ఉన్న పాత్ర కోసం సిద్ధం కావడానికి, ఆమె క్రావ్ మగలో శిక్షణ పొందింది. ఐకిడో, బాక్సింగ్, జూడో, కరాటే, కుస్తీ నుండి ఈ పద్ధతులను నేర్చుకుంది.
ఐశ్వర్య రాయ్ బచ్చన్
తమిళ చిత్రం 'రోబోట్'లోని పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ బచ్చన్ అనుభవజ్ఞుడైన బోధకుడు రమేష్ మార్గదర్శకత్వంలో కరాటే నేర్చుకున్నారు. ఆమె భారతదేశంలోని జపాన్ షొటోకాన్-ర్యు కరాటే స్కూల్స్ లో కరాటే శిక్షణ పొందింది.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. ఆమె దక్షిణ భారత మార్షల్ ఆర్ట్ కలరిపయట్టు శిక్షణ పొందింది.
కత్రినా కైఫ్ 'టైగర్ జిందా హై' చిత్రంలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. హమామ్ సిరీస్‌లో తన నమ్మశక్యం కాని మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలను ప్రదర్శించారు. 'జగ్గా జాసూస్' చిత్రంలోని పాత్ర కోసం కత్రినా కైఫ్ ఇజ్రాయెలీ యుద్ధ వ్యూహమైన క్రావ్ మగను అభ్యసించారు.
వీరితోపాటు నటి తాప్సీ పన్ను మిశ్రమ మార్షల్ ఆర్ట్స్, క్రావ్ మగలో శిక్షణ పొందింది. నటి అదా శర్మ ఒక నైపుణ్యం కలిగిన మార్షల్ ఆర్టిస్ట్, 'కమాండో 3'లో తన సాహసాలను ప్రదర్శించారు. 'మర్ద్ కో దర్ద్ నహి హోతా' చిత్రం కోసం రాధికా మదన్ 'జీత్ కునే డో' అనే కొత్త రకమైన మార్షల్ ఆర్ట్‌ను ప్రదర్శించారు.
నటి దిశా పటాని, కంగనా రనౌత్ కిక్‌బాక్సింగ్ నేర్చుకున్నారు. ఇలా నటీమణులు వివిధ రకాల మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అయి తమని తాము రక్షించుకోవడానికే కాదు, సినిమాల్లోనూ ఉపయోగిస్తూ తమ ప్రతిభని చాటుతున్నారు. మహిళలకు ఆదర్శనంగా నిలుస్తుంది.