Sep 28, 2019, 3:24 PM IST
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు దక్షిణ భారత దేశంతోపాటు ఉత్తరాదిని కూడా వీడడం లేదు. గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వల్ల బీహార్ రాజధాని పాట్నా జలమయమయ్యింది. రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. పాట్నా యూనివర్సిటీ తదితర ప్రాంతాలు పూర్తిగా జలదిగ్బంధనంలో ఉన్నాయి.